పుట:పల్నాటి చరిత్ర.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పల్నాటి చరిత్ర

9

పల్నాటినేలిన ప్రభువుల చరిత్ర

క్రీస్తునకు పూర్వము నాగులను జాతివారు పల్నాటిలో నుండిరి. ఆంధ్రదేశములో బౌద్ధమతము వ్యాపించిన పిమ్మట బౌద్ధ శాసనములు పాళీ భాషలో నున్నవి. గురజాలలో రెంటచింతలపోవు రోడ్డు నానుకొని కోటసాని దిగుడు బావి వద్ద పాళీభాషలోని యొక శాసనముకలదు. నాగార్జునుని కాలమున ననగా రెండవశతాబ్దాన్తమున పల్నాడు ఆంధ్ర ప్రభువులగు శాతవాహన వంశపురాజులక్రింద నుండెను,

అప్పుడేలురాజునకు బంధువగు చాంతిశ్రీయను రాచకుమారి ప్రోద్బలముచే నాగార్జునకొండ స్థూపము కట్టబడినట్లు నాగార్జునకొండలోని పాళీభాషలోగల శాసనమునుబట్టి తెలియుచున్నది. ఆంధ్రులు నాలుగు వందల సంవత్సరములు పాలించిరి. వారిరాజ్యము 'కంచి' (కాంచీపురము) మొదలు మగధ (బీహారు) లోని పాటలీపుత్రము (పాట్నా) వఱకును. తూర్పు పడమరల నుభయసముద్రముల వఱకును వ్యాపించెను, వారు రోము మున్నగు దేశములతో వ్యాపారము చేసిరి, నాగార్జునకొండలో కొన్ని రోమీయనాణెములు దొరకినవి. ఆంధ్రులనాణెములమీద “ఓడ ” ముద్రింపబడినది. (వానిని నేను చూచితిని) వారలకు కొంతకాల మమరావతియు, కొంతకాలము అమరావతికి వాయవ్యదిక్కున మూడు