పుట:పల్నాటి చరిత్ర.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6

పల్నాటి చరిత్ర


తుమ్మురుకోడు:- ఇది కృష్ణానదికి మూడుమైళ్ల దూరమున నున్నది. గోల్కొండ నవాబుకు తన సామ్రాజ్యమునకు సరిహద్దుగానున్న తుమ్మురుకోడువద్ద తిమ్మరుసు మంత్రి పేర రాయలొక కోటగట్టి కొంత సైన్యము రక్షణగా నుంచెను. అందువలన నాగ్రామమునకు తిమ్మరుసుకోట యనియు తుమృకోడు యనియు పేరువచ్చెనందురు.

నాయకురాలి కనుమ:- బాలచంద్రుని బోనీయక యిచ్చట నాయకురాలు పంగచాచి నిలుచుండెననియు, బాల చంద్రుడు ఖడ్గముచే కొండనునఱకి త్రోవ చేసికొని పోయెననియు నందురు. కొండనిలువుగా నరికినట్లు గన్పించును. కొండశిఖ రమునుండి బాలచంద్రుడు గుఱ్ఱమును దూకించిన ప్రదేశమును అచ్చటివారు జూపింతురు.

గుత్తికొండ బిలము:- యుద్ధమున చనిపోయినవీరులను బ్రహ్మనాయుడు బ్రదికించి వెంటబెట్టుకొని గుత్తికొండబిలములో ప్రవేశించెననియు నందఱు నిజరూపముల గైకొని రనియు వీరభద్రకవి వ్రాసెను.

వీరులగుడులు:- కారెమపూడిలో నాగులేటి యొడ్డున గంగధార మడుగు వద్ద నివికలవు. కొన్ని విడిస్తంభములు మండపములు కూడ కలవు. యుద్ధములో చనిపోయిన వీరుల పేర రాళ్లు కలవు. పల్నాటి యుద్ధానంతరము మహమ్మదీయుల కాలమున నొక గొప్ప సైన్యము దక్షిణమునుండి హైదరాబాదుకు పోవుచు కారెమపూడిలో నాగులేటి యొడ్డున విడిపి