పల్నాటి చరిత్ర
5
లయములోని యెఱ్ఱబండ శాసనములో మాచెర్లయని కలదు.
వీరచరిత్రలో మాచర్ల మాచెర్ల యని శ్రీనాధుడు వాడెను.
బ్రహ్మనాయుడు మలిదేవాదులతో గూడి వలగామునినుండి
విడివడివచ్చుచు మజిలీచేసిన చోటు కావున మాచర్లయని
వచ్చినని వీరచరిత్రలోకలదు. రెండవ ప్రతాపరుద్రునికి
లోబడి మాచర్ల సీమనేలిన మాచయనాయనిగారి పేరునుండి
యైనను యాపేరు వచ్చియుండవచ్చును. మారీచుడేలిన చోటు
మాచర్లయనియు ఖరుడేలినది కారెమపూడియనియు దూషణు
డేలిననది దుర్గి యనియు, విశ్వామిత్రుడు సత్ప్రయాగము
చేసినది సత్రశాలయనియు యందుఱుకాని యందులకుదగిన
దృష్టాంతములు లేవు. మాచమనాయనికి పూర్వపు శాసనములందు
మహదేవి చెరువనియు తరువాత శాసనములందును గ్రంధము
లందును మాచర్ల మాచెర్ల యనియు కలదు.
దుర్గాలయమునుబట్టి దుర్గి యను పేరుగలిగెను. అలరాచమల్లు పేర మాచర్ల కాఱుమైళ్ల దూరమున రాచమల్లుపాడు (రచ్చమల్లెపాడు) కలదు. ఝట్టిరాజు పేర తుమృకోటకు నాల్గు మైళ్ళ దూరమున ఝట్టిపాలెము (జెట్టిపాలెము) అలుగురాజుపేర అలుగు రాజుపల్లెయు, మలిదేవాదుల పేర మల్లవరమును కలవు. అనుగురాజు సముద్రస్నానమునకు బోయినప్పుడు దొడ్డనాయుని పేర నాయునిపల్లెయు, శీలాంబ పేర చీరాలయు, పేర్నీని పేర పేరాలయు కట్టించినట్లు వీరభద్రకవి వ్రాసినాడు.