పుట:పల్నాటి చరిత్ర.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పల్నాటి చరిత్ర

7


వీరుల లింగములను పొయిగడ్డలకు వాడుకొనగా సైన్యమంతయు మూర్ఛిల్లెనట. అంత నొకబ్రాహ్మణునిచే, తన యపచారము తెలిసికొని వీరులకు గుడులు కట్టించునట్లు మ్రొక్కు కొనగా సైనికులు లేచిరట. అంత నతడాగుడులను కట్టించె నెట. అతడు వీరుల యందుభక్తిగలిగి వీరుల శౌర్యములు వినగనే నావేశముగలిగి యతడును యతని తమ్ముడును పొడుచుకొని చచ్చిరట. వారి గోరీలిప్పటికిని యున్నవి. పంచమకుల సంజాతుడైనయొక వీరునిగుడికూడ నిందు నిర్మింపబడియున్నది.

బాస్వెలు దొరవారి రిపోర్టులో “I may mention that lead is found in considerable quantities near Karempudi in Palnad but the mines are not worked. Copper is found both in Palnad and Vinukonda taluks " అని కలదు. గవర్నమెంటుకు దొరచేసిన రిపోర్టు 7-11_1870 తేదిగల G. O. (Act 1 of 1870) లో నచ్చుకాబడినది. పల్నాటిలోని కొన్ని గ్రామములలో నినుము కరిగిన పెద్ద కొలుముల చిహ్నములు నిప్పటికి స్పష్టముగా గన్పించుచున్నవనియు మరియు గుత్తికొండలోని నొకభాగమునకు కొలుములపాలెమని పేరున్నదనియు ఉమాకాంతముగారు వాసిరి. గుత్తికొండవద్ద కొండను తుమృకోటవద్దకొండను నినుపకొండలని యిప్పటికి నందురు. గురిజాలలో సూరెకారపుఉప్పును ముప్పదిసంవత్సరముల క్రిందటి వఱకు చేయుచుండిరి. ఆచిహ్నము లిప్పటికిని స్పష్టముగా నున్నవి.Memos of Geographical survey of India vol 8 1 0 పుటలో