పుట:పల్నాటి చరిత్ర.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2

పల్నాటి చరిత్ర


కలదు. కొండవీడు మొదలు కందుకూరువఱకు (ప్రస్తుతము గుంటూరు, ఒంగోలు తాలూకాల్ను, సత్తెనపల్లి, నరసరావుపేట తాలూకాలలో కొంతభాగమును, నెల్లూరు కర్నూలు జిల్లాలలో కొంతభాగమున) గల ప్రదేశము పాకనాడు అందురు ప్రస్తుతము పల్నాటి తాలూకానున్ను, సత్తెనపల్లి నరసరావుపేట వినుకొండ తాలూకాలలో కొన్ని గ్రామములను కలిపి పూర్వము పల్నాడనిరి. పల్నాటికి పలనాడు, పలినాడు పల్లె నాడు అని నామాంతరములు, పల్లవులు పాలించుటచే పల్లవ నాడు అను పేరు వచ్చి తరువాత పలనాడుగను పల్నాడగను మాఱినదని చిలుకూరి వీరభద్రరావుగారి యాంధ్రుల చరిత్రలో కలదు. పల్లవులు చాల దేశము పాలింపగ ఈ దేశభాగమునకు మాత్రమే ఈ పేరెందుకు వచ్చెనో తెలియదు. పల్లె లుండుటచే పల్లెనాడు అని వచ్చినదనియు, అచ్చట దొరకు పాలరాతినిబట్టి పాలనాడు పలనాడు అనిన యింకను బాగుండు ననియు (The name is derived from pallenadu land of hamlets. A more poletical derivation of Palnad is Palanad(milk land) from the light cream coloured_marbles that abound there) అని కృష్ణా డిస్ట్రిక్టు మాన్యుయల్ లో కలదు. పల్లుగానుండుటచే పల్లునాడయి పల్లు విల్లు ముల్లు శబ్దములబోలె పలునాడుగను, తరువాత పలనాడు పల్నాడుగను మాఱియుండునని అక్కిరాజు ఉమాకాంతముగారు వ్రాసిరి, మాచర్ల యాదిత్యేశ్వరాలయ శాసనములో ‘పల్లిదేశ'మనికలదు. అమరావతి శాస