పుట:పల్నాటి చరిత్ర.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పల్నాటి చరిత్ర

గుంటూరు జిల్లా తాలూకాలలోని కెల్ల పల్నాడు పెద్దది. వైశాల్యము 1050 చ. మైళ్లు. ఉత్తరమున 80 మైళ్లు, కృష్ణా నది కలదు. కృష్ణ కావలి యొడ్డున నైజాముకలదు. పల్నాటి నుండి శ్రీ శైలమువఱకు నల్లమల కొండలును అడవులును వ్యాపించియున్న వి.

చారిత్రిక విషయములు

పల్నాడు:-నాడు అనగా దేశములో కొంత భాగము, మన పూర్వులు దేశమును నాడులు, సీమలు మండలములుగా విభ జించిరి. పల్నాడు, రేనాడు, పాకనాడు, వెలనాడు మొదలగు నవి నాడులు. గుంటూరు జిల్లాలోని చందవోలు పరిసర ప్రాంత మును ప్రస్తుతము తెనాలి, రేపల్లె, బాపట్ల తాలూకాలను) వెలనాడు అందుకు. దానికి కమ్మనాడు అని నామాంతరము