పుట:పల్నాటి చరిత్ర.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పల్నాటి చరిత్ర

3


నములో "పలనాడు" అని కలదు. కారెమపూడి తూర్పువైపు నల్లాంచక్రవర్తుల శాసనములో 'పలినాటి' వారు అని కలదు. పూర్వకవులు "పల్లెనాడు" అని గ్రంధస్థము చేసిరి, శ్రీనాధుని చాటుపద్యములలో 'పల్లెనాటిసీమ పల్లెటూళ్లు: 'రసికుడు పోవ పల్నాడు' ' పన్నుగ పలినాటిసీను ప్రజలందఱికిన్' 'పలినాటికి మాటికి పోవనేటికిన్' 'కారేమపూడి పట్టణము కాశిగదా పలివాటివారికన్' అని కలదు. ప్రభావతీ ప్రద్యుమ్ను ములో పింగలి సూరన తనవారు 'పలనాటను పాకనాటనున్ ప్రసిద్ధులైనట్లు వ్రాసికొనినాడు.

వీరభద్రకవి సన్మానంబొప్ప నొసంగె పుత్రికకు పల్నాడైదు దేశంబులన్' అని పల్నాటి వీరభాగవతములో వ్రాసి నాడు. ప్రబంధ పరమేశ్వర వేంకటేశ్వర విలాసములో 'పలనాటి గొల్లలపాటజాతి' యని గణపవరపు వేంకటకవి వ్రాసెను అప్పకవీయములో నప్పకవి "పల్లెనాటను నూటతొంబదియు నాలుగ్రామముల” అని వ్రాసెను. దొరకినదానిలోనికెల్ల పూర్వపుదియగు మాచర్ల యాదిత్యేశ్వరాలయ శాసనములో “పల్లి దేశ” మని యుండుటచే పల్లెలుండుటచే పల్లెనాడు పల్నాడు అని పేరు వచ్చియుండును.

నాగులేరు:- పూర్వము నాగులను జాతివారు నివసించు టచే నాగులేరను పేరు వచ్చెనందురు. 'నాగాధిపతి ప్రాణనాశంబుచేసి నడుముగాబాఱిన నాగులేఱాయె" యనియు 'తరువాత సర్పాఖ్యతటిని లోపలను' అని శ్రీనాధుడు పల్నాటి