పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

60

పద్మపురాణము


తే.

కాష్ఠపాషాణమృత్తులఁ గరము భక్తిఁ
గడఁక దేవాలయంబులు గట్టు నతఁడు
తివిరి పితరులతోఁ గూడ దివ్యయుగము
లమరపదమున సౌఖ్యంబు లనుభవించు.

83


వ.

మఱియు యతిగేహ [1]విప్రనిలయ జనాశ్రయ దీనానాథగృహం
బులు నిర్మించినవారలు కనకగృహనివాసు లగుదురు. జీర్ణో
ద్ధరణంబు తత్ఫలద్విగుణంబగు. యతి విప్ర దేవ ధనంబులం
బొరయు నతం డిరువదియొక్కనరకంబులు సపశుపుత్త్రబాంధ
వుండై యనుభవించు. లోభమోహంబుల మఠాధిపత్యంబు చేసిన
వాఁడు సర్వధర్మబహిష్కృతుండగుం గావునఁ దద్గృహాన్నభోక్త
కుం జాంద్రాయణాచరణంబు వలయు; నతని సంస్పర్శనంబున
సచేలస్నానంబు చేయవలయు; వస్త్రాన్న[2]దానాదులు దేవబ్రాహ్మణ
మఠపతుల కొసంగునతండు నక్షత్రలోకంబున వెలుంగుచుండు.

84


క.

హరిహరహిరణ్యగర్భుల
కరుదుగఁ బూదోఁట లిడిన యనఘాత్ములు ని
ర్జరలోకసుఖముఁ గాంతురు
కర మనురాగమున బ్రహ్మకల్పము దాఁకన్.

85


క.

అతిథుల దేవతలను స
న్మతితోఁ బూజించునట్టి మనుజులు వేడ్కం
జతురాననలోకంబున
నతిశయకల్పంబు లుందు రమృతాశనులై.

86


సీ.

అలసి మధ్యాహ్నంబునందు వచ్చు [3]నతిథి
        కెడసేయ కన్నంబు లిడు గృహస్థుఁ
డొగి నింద్రలోకంబు నొందుఁ దాఁ గడపిన
        నతనిపాతకమెల్ల నితఁడు వొందు

  1. విప్రనిలయాది గృహంబులు (ము)
  2. పానాదులు (తి-హై)
  3. యర్థి (ము)