పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-ద్వితీయాశ్వాసము

59


క.

లలిదంభ లోభ హాస్యం
బుల నొండెను శఠత నొండె భూతేశ్వరునిం
దలఁచినవారలు [1]మఱియును
నలఘుమతిన్ యముని[2]కడకు నరుగరు సుమ్మీ!

79


సీ.

స్ఫటికశిలారత్నపార్థివంబుల శివ
       లింగంబుఁ గావించి సంగతముగఁ
బంచాక్షరీజపపరతఁ ద్రికాలంబుఁ
       బూజించు శివభక్తి పూతమతులు
నిరయంబుఁ జూడక నిరతిశయంబగు
       శివలోకమునను వసింతు రెపుడుఁ;
బూజసేయకయైన భూతేశు నతిభక్తిఁ
       దలఁచినమాత్రన తత్పదంబుఁ


తే.

బొందఁ గాంతురు; శివభక్తిఁ బోలనొండు
ధర్మములు లేవు; శివునికిఁ దగ సమర్పి
తంబులగు పత్రపుష్పఫలాంబువులును
మొనసి నిర్మాల్యములు గాఁగ ముట్టరాదు.

80


వ.

తత్పదార్థంబు లన్నియుఁ గూపనిక్షేపణంబులు చేయునది గాని
యది యుల్లంఘించిన మహాపాతకంబగు. మక్షికాంఘ్రిమాత్రం
బును శివధనంబు లపహరించువారు ఘోరనరకప్రాప్తు లగుదురు.
హరిహరాదులయం దేదేవు నారాధించిన యయ్యైలోకంబుల
కరిగి సుఖంబు లనుభవింపుదురు.

81


క.

హరిభక్తులై మహేశ్వరుఁ
బరువడి శివభక్తులయ్యుఁ బంకరుహాక్షుం
గరకరివడి దూషించిన
నరు లేగుదు రుగ్రమైన నరకంబునకున్.

82
  1. మరచియు (మ-తి)
  2. పురికి (మ-తి)