పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

15

23. స్కాందపురాణాంతర్గతం : భీమఖండ కాశీఖండములు శ్రీనాథుడు; నాగరఖండం తురగా రాజకవి, అయ్యంకి బాలసరస్వతి జంటకవులు; శివరహస్యఖండం రేవూరి అనంతయజ్వ, ముదిగొండ బ్రహ్మయలింగం, కోడూరి వేంకటాచలకవి, రాపాక వేంకటకవి; కాశీమహిమార్థదర్పణం కళులె నంజరాజు; కేదారఖండం పెదపాటి సోమయ్య; కేదార అరుణాచల కౌమారికా ఖండాలు జనమంచి శేషాద్రిశర్మ.

24. సూతసంహిత : పట్టమట్ట సోమనాథ కవి

25. హరివంశం : నాచన సోమన, ఎఱ్ఱాప్రగడ, గూళికల్లు వేంకటరమణ కవి

ఇక క్షేత్రమాహాత్మ్యాలు, స్థలపురాణాలు, వివిధపురాణభాగాలు లెక్కకు మిక్కిలి తెలుగులో వచ్చినవి. ఇటీవల మరల పురాణాంధ్రీకరణం ఒక ఉద్యమంగా తెలుగుదేశంలో విజృంభించినది. కాకతీయ సిమెంటు అధిపతులు, ధర్మనిష్ఠులు పి. వేంకటేశ్వర్లుగారు ఆర్షభారతి ట్రస్టును స్థాపించి పురాణాలు సంస్కృతమూలంతో ప్రకటిస్తున్నారు. వివిధపండితులచేత వచనానువాదాలు చేయిస్తున్నారు. కల్లూరి వేంకట సుబ్రహ్మణ్య దీక్షితులు అనువదించిన బ్రహ్మ, విష్ణు పురాణాలు, విష్ణుధర్మోత్తరీయం, పాతూరి సీతారామాంజనేయులు అనువదించిన మత్స్యపురాణం, దేవులపల్లి శివరామయ్య అనువదించిన దేవీభాగవతము, పుల్లేల శ్రీరామచంద్రుడు అనువదించిన అగ్నిపురాణం ప్రకటితమైనవి. మార్కండేయ, వామన, స్కాందపురాణాలు అచ్చులో ఉన్నవి. శ్రీవెంకటేశ్వర్లు గారు సంపన్నులు ధర్మాభిమానులు కనుక ఇంతగొప్పకార్యానికి పూనుకొన్నారు. కాని ఒక పేదపండితుడు "అనంత సాహితి" పేరుతో ఒక సాహిత్యసంస్థను స్థాపించి దాని పక్షమున పురాణాలన్నీ తామే సరళాంధ్రభాషలో అనువదిస్తూ ప్రకటిస్తున్నాడు. ఆయన గుంటూరు ఓరియంటల్ కళాశాలా