పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-ద్వితీయాశ్వాసము

53


వ.

అది యెట్లంటేని.

51


క.

ఒక తరువున బహువిధముల
శకుంతములు [1]గూడి విడియు చందంబునఁ బు
త్త్రకళత్రాదులఁ గూడుదు
రొకనెలవునఁ బాసిపోదు రూరక పిదపన్.

52


ఆ.

ఎవ్వఁ డెట్టిభంగి నేకర్మ మొనరించు
నట్లు కర్మఫలము లనుభవించుఁ
గాన వారి వారి కర్మఫలంబులు
కమలభవునకైనఁ గడవరాదు.

53


వ.

అట్లు గావున.

54


ఆ.

అన్న యనుచు నీకు నడ్డంబుఁ [2]గాఁ జన
దతనిపాతకమును నతఁడు వొంది
నరకగామి యయ్యె సురలోకపదము నీ
కబ్బె నిట్లు సుకృతివైన కతన.

55


క.

అనిన వికుండలుఁ డిట్లను
ననఘా! నా జన్మమెల్ల నన్యాయము చే
యనకాని యొక్క పుణ్యము
[3]నెనయఁగ నేఁ జేసి యెఱుఁగ నించుకయేనిన్.

56


వ.

[4]మత్పుణ్యఫలంబు నీ వెఱుంగు దేనియుం జెప్పు మనిన
నతండు సకల భూత సుకృత దుష్కృతంబులు నా యెఱుంగని
యవి లేవు వినుమని యిట్లనియె.

57
  1. చేరియున్న (ము)
  2. రాజన (హై)
  3. నెనయఁగఁ జేయంగ నెఱుఁగ నే నించుకయున్ (ము)
  4. అ ప్పుణ్య (ము)