పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

52

పద్మపురాణము


తే.

ఓ వికుండల! దివమున కీవు రమ్ము
కదిలి భవదీయకృతపుణ్యకర్మభోగ
మనుభవింపంగ నావుడు ననియె నాతఁ
డా కృతాంతకుదూతతో నల్లఁ జేరి.

47


సీ.

యమదూత! వినుము నా కాత్మలోపల నిప్పు
         డత్యంతవిస్మయం బయ్యెఁ జూడ
నాతఁడు నేనును నన్నదమ్ముల మొక్క
         తల్లిగర్భంబునఁ దనరఁ బుట్టి
యేకర్మమైనను [1]నేకకార్యతఁ జేసి
         యెన్నఁడు [2]దగఁ బాయకున్నచోట
మా కొక్కచోటన మరణంబు ప్రాపింప
         నిట కేము వచ్చితి మిద్దఱమును


తే.

నందు మా యన్న నరకంబునందుఁ ద్రోచి
నన్ను నేటికిఁ గొనిపోవ నాకమునకు
నరయ నే నేమి చేసితి నతనికంటె
నన్ను మన్నించి చెప్పుమా యున్నరూపు.

48

వికుండలుండు యమదూతలవలన నిఖిలధర్మార్థంబులు వినుట :

వ.

అనిన వికుండలునకు యమదూత లిట్లనిరి.

49


ఆ.

తల్లి దండ్రి యన్నదమ్ములు తనయులు
లలన చెలి యనంగఁ గలుగువారు
పూర్వజన్మకర్మభోగసంప్రాప్తులై
మక్కువలఁ జరింతు రొక్క[3]యింట.

50
  1. ఏకవాక్యత జేసి (మ-తి)
  2. బడి వాయకున్న చోట (మ-తి)
  3. చోట (ము)