పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

50

పద్మపురాణము


సీ.

అతని తనూభవు లర్థంబు మదమున
      యౌవనంబునఁ గడుఁ గ్రొవ్వి దురభి
మానులై గర్వితమతి సురాపానాది
      దుష్టదుర్వ్యసనులై కష్టచరితు
లనవరతంబు వేశ్యాసక్తులై నట
      విటగాయకులతోడ వివిధగోష్ఠి
ననురక్తులై ధనం బంతయు [1]వేణువీ
      ణాదులౌ సర్వవినోదములను


తే.

గొల్లలుగ వెదఁజల్లుచుఁ దల్లిమాట
వినఁగనొల్లక యున్మత్తవృత్తిఁ దగిలి
[2]సకలబంధుల దూషించి సతతంబు
నాతతాయితఁ జరియించి రవనినెల్ల.

39


వ.

ఇవ్విధంబున వైశ్యకుమారులు దేవగురుపితృభక్తివిరహితులై
నిచ్చలుం బెచ్చు [3]పెరిగిన మచ్చరంబునఁ దమ్ముఁ దా మెఱుం
గక తిరుగుచుండం గతిపయదివసంబులకు ధనంబంతయు నశించి
దారిద్ర్యంబు గదిరిన.

40


క.

దాసీదాసజనంబు లు
దాసీనతఁ దమ్ము విడిచి తమతమగతులం
బాసి చనిరంతఁ జుట్టలు
వేసరి చని రిష్టసఖులు వెఱచిరి పలుకన్.

41


వ.

అంత.

42
  1. వెలిజల్లి, వేణువీణాదికవిధవినోద, తతుల గాలంబు బుచ్చుచు దల్లి మాట (తి-హై)
  2. స్వకుల (ము)
  3. వెరిగి (ము)