పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-ద్వితీయాశ్వాసము

49


సీ.

[1]పురుషత గలనాఁడె పురుషార్థములఁ [2]జేయు
       మొప్పార నని చెవిఁ జెప్పఁగోరు
చెలికాని పోలికఁ జెంపల నరవొంది
       నంత దేహం బనిత్యంబు గాఁగఁ
దలఁచి వైశ్యుండెల్ల ధర్మంబులను జేసి
       చెఱువులు గట్టించి శిష్టలీల
దేవాలయంబులు బావులు నల్లిండ్లుఁ
       జలిపందిరిలు నన్నసత్రములును


తే.

గొలఁది మిగులంగఁ గట్టించి చెలఁగి యాయ
మరసి భాగించి ధనము షష్ఠాంశమెల్ల
మహితలీలల నుదయాస్తమయములందు
దానములు సేయుఁ దృఢభక్తిఁ బూని యతఁడు.

37

శ్రీకుండల వికుండలుల చరితము :

వ.

ఇట్లు సకలధర్మపరాయణుండును గృతజన్మదోషప్రాయశ్చిత్తుం
డును నగు హేమకుండలునకు నిరువురు తనయులు శ్రీకుండల
వికుండలు లను నామంబులం బ్రసిద్ధులగు వార లుదయించిన
నతండు వారలకుఁ దానశేషంబగు ధనంబంతయు [3]నిచ్చి విర
క్తుండై వనంబున కరిగి యతిఘోరంబగు తపంబు సేసి పుణ్యనదీ
తీరంబునఁ బుండరీకాక్షు మనంబున నిడి శరీరంబు విడిచి విష్ణు
లోకంబునకుం జనియె నంత.

38
  1. ఉరవు గలిగినవాడ (తి)
  2. చేయ, నొప్పారునని చెవి చెప్ప జేరు (హై)
  3. నొసంగి సంసారభ్రాంతి బాసి విరక్తుండై (హై)