పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

13

మన పూర్వకవులు సంస్కృతంలోని ఈ పురాణాలను తెలుగుపద్య గద్య ద్విపదలుగా మలచి పురాణాల ప్రచారం చేసినారు. అట్టి వారిలో కొందరు—

1. ఆదిత్యపురాణం : ఎలకూచి బాలసరస్వతి తమ్ముడు పిన్నయ ప్రభాకరుడు

2. కూర్మపురాణం : రాజలింగ కవి, తిమ్మరాజు లక్ష్మణరాయ కవి

3. గరుడపురాణం : పింగళి సూరన

4. దేవీభాగవతం : త్రిపురాన తమ్మయదొర, దాసు శ్రీరామకవి, ఆకొండి రామమూర్తి శాస్త్రి, తిరుపతి వేంకట కవులు

5. నారదీయం : పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవి

6. నృసింహపురాణం : వేములవాడ భీమకవి, ఎఱ్ఱాప్రగడ, ప్రోలు గంటి చిన్నశౌరి, హరిభట్టు

7. పద్మ పురాణం : మడికి సింగన, కామినేని మల్లారెడ్డి, త్రిపురాన వేంకట సూర్యప్రసాదరాయకవి, తెన్మఠం శ్రీరంగాచార్యులు, పినుపాటి చిదంబరశాస్త్రి

8. పురాణసారం : ఎఱ్ఱన (కొక్కోక రచయిత), గణపవరపు వేంకటకవి

9. భాగవతం : పోతన సింగన గంగయ నారయలు, మడికి సింగన, హరిభట్టు, రావూరి సంజీవరాయ కవి, తరిగొండ వెంకమ్మ, తంజనగరం తేవ ప్పెరుమాళ్ళయ్య, శ్రీపాదకృష్ణమూర్తిశాస్త్రి

10. బ్రహ్మపురాణం : జనమంచి శేషాద్రిశర్మ