పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-ప్రథమాశ్వాసము

35


తే.

[1]గమ్మతావులు కటిపంక్తి గడలుకొనఁగ
శంబరాంతకు మోహనశక్తివోలె
నలరు నూర్వశి నా నొక్కయమరకాంత
తివుట నేతెంచె నప్పురూరవునికడకు.

161


క.

వచ్చి తగ నతని ముందట
మచ్చికతో నిలిచి యచటి మానవు లెల్లన్
మెచ్చి తనుఁ జూచుచుండఁగఁ
బచ్చనివిలుకానిబారిఁ బడి యి ట్లనియెన్.

162


ఉ.

నీ దగు రూపు సద్గుణవినిర్మలకీర్తులు నారదుండు దా
నాదరలీల నింద్రుసభయందు నుతింపఁగ విన్నమాత్రలో
నాదగునట్టి ధైర్యము [2]మనంబును విన్కలి చూఱవుచ్చినం
గాదన కిప్పు డేను నినుఁ గానఁగ వచ్చితి రాజశేఖరా!

163


వ.

అని యనుకంప దోఁపఁ బలికినం జూచి మన్మథాకారుండగు
పురూరవుండు శరణాగతరక్షణంబును నుత్తమస్త్రీలాభంబును దొర
కొనుట పురుషార్థంబుగా నిశ్చయించి సుపర్వస్త్రీపూర్వయగు
నూర్వశిం బరిగ్రహించి తనపురంబున కరిగి విష్ణువరప్రసాదం
బునం జక్రవర్తిపదప్రాప్తుండై యచ్చట రాజ్యసుఖంబు ననుభ
వించుచుండె నట్లు గావున.

164


క.

నీ దోషంబు నడంగెడు
నాదట నీవ్రతము సేయు మాతనిగతి వి
ద్యాధర పౌష్యపుశుద్ధ
ద్వాదశియును నీదు సుకృతవశమున వచ్చెన్.

165


వ.

అట్లు గావున నీ వచ్చునేకాదశియందు ని మ్మణికూటపర్వతంబునం
గల పుణ్యనదియందుఁ గృతస్నాతుండవై యనశనబ్రహ్మచర్య

  1. కమ్మతావులగతి పంక్తి (ము)
  2. మనం బసమాస్త్రుఁడు (తి)