పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

34

పద్మపురాణము


వ.

ఉన్న పురూరవునకుం గరుడధ్వజుండు ప్రత్యక్షంబై సప్తసప్తి
మకరప్రాప్తుండైన యమ్మాసంబున నవగాహనంబు చేసి నను
నారాధించితి గావున మహాత్మా! నీకు సప్తజన్మార్జితతపఃఫలంబు
సంభవించెనని పలికి మాఘశుద్ధద్వాదశియందు నతనిశరీరంబున
శంఖోదకంబుల సమ్మార్జనంబు చేసి తైలసేవాదోషం బపనయించి
యతనికిం జక్రవర్తిపదవిం బ్రసాదించి లక్ష్మీశ్వరుం డంతర్హితుం
డయ్యె నంత.

157


క.

నరపతి గతపాతకుఁడై
నిరుపమకమనీయమూర్తి నెగడిన కతనన్
మరుని జయంతుని నలకూ
బరు నశ్వినులను జయించె భవ్యస్ఫూర్తిన్.

158


వ.

అంత.

159


క.

వెన్నెల నీనెడి నవ్వును
గన్నుల[1]చెలువంబుఁ జన్నుఁగవయొప్పిదమున్
నెన్నడుము బడువుఁ దనమును
బున్నమనెలఁ దెగడు మోముపొలుపును మెఱయన్.

160


సీ.

ఘననీలమణికాంతిఁ గనుపట్టుకొప్పుపై
       మందారపుష్పదామములు వెలుఁగ
నిభకుంభయుగమున కెనవచ్చుఁ జనుదోయిఁ
       బూననేరక లేఁతకౌను నులియఁ
బద్మరాగారుణపదపల్లవంబుల
       రత్ననూపురమంజురవము లులియఁ
గందర్పునందంబు గతిఁ బొల్చు మోమున
       మహితచందనలలామము దనర్పఁ

  1. పొలపంబు (హై-తి)