పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-ప్రథమాశ్వాసము

33


మ.

ఇది యేకర్మఫలంబునం గలిగెఁ [1]దా నీపాప మింకేమిటం
దుదియందు న్నిది నాకుఁ జెప్పు మునిశార్దూలా! మహాభాగ! నా
వదనాబ్జంబున నవ్వుదేర భృగుఁ డవ్యాఘ్రాస్యుతో నిట్లనుం
ద్రిదశేంద్రాదులనైనఁ గర్మఫలముల్ [2]తేజంబు వారింపవే.

152


ఆ.

ఈఁగకాలి యంతయేనియు విషమైన
యదియు మృత్యుహేతువైన యట్ల
యల్పమయ్యుఁ గర్మ మట నొయ్యనొయ్యన
దారుణత్వ మొందు ధర్మచరిత!

153


వ.

అది యెట్లనిన నీవు కృతయుగంబున మాఘమాసంబునం దేకాదశి
యం దుపవసించి ద్వాదశియందుఁ దైలాభ్యంజనరంజితుండ
వైతివి కావున నప్పాపంబున నీ కిట్టివికృతాననంబు సంభవించె
నని చెప్పి భృగుండు దొంటికథ యొక్కటి గల దాకర్ణింపుమని
యి ట్లనియె.

154

పురూరవశ్చరిత్రము :

తే.

వీరశేఖరుఁడైన పురూరవుండు
చెంది నీయట్ల ద్వాదశియందుఁ దైల
మంటుకొనుదోషమున వికృతాంగ మొంది
మనుజు లెవ్వరు పడని యుమ్మలిక గదిరి.

155


చ.

తనతను వొందినట్టి వికృతత్వముఁ గన్గొని జాలిఁ బొంది య
య్యనఘుఁడు దేవతాతటినియం దవగాహము చేసి నిష్ఠమై
ననశనదీక్ష నొంది హరి నంబుజనాభునిఁ జక్రపాణి నె
మ్మనమున నిల్పి నిచ్చలును మాఘమునన్ వ్రత మాచరించుచున్.

156
  1. నాకీ (హై-తి)
  2. ప్రేరేపి కారింపవే (హై-తి)