పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-ప్రథమాశ్వాసము

31


కులారావసంకులంబును దేవయక్షరాక్షసనానావిధభూతజాత
సేవ్యమానంబును దరీముఖప్రసృతనిర్ఝరవారిధారాపాతచూత్కార
ముఖరితనభోంతరంబును మదకరికలభపృథుబృంహితబధిరీ
కృతసమీపదేశంబును కస్తూరికాసంకుమదపరిమళమిళితగుహాం
తరంబును విచిత్రచమరీమృగజాలాలోలవాలవ్యజనవిరాజితం
బును షట్త్రింశత్సంఖ్యాయోజనోన్నతంబును [1]శతయోజనా
యతవిస్తారంబును నైన మణికూటపర్వతంబుఁ జూచి సంతసిల్లి
దుర్భిక్షపీడితుం డగు భృగుమహాముని తత్ప్రదేశంబునఁ బర్ణశాల
నిర్మించి శిష్యగణసమేతుండై తపంబు సేయుచున్నంత
నొక్కనాఁడు.

143


తే.

పులియు హరిణియు నెడఁగూడి పొలసినట్లు
పరుషశార్దూలముఖుఁడైన పురుషు వెంట
పసిడిపుత్త్రిక గతి నొక్కపద్మవదన
కూడి చనుదెంచె నప్పు డక్కొండనుండి.

144

భృగు విద్యాధర సమాగమము :

వ.

ఇట్లు వచ్చి యమ్మహామునీశ్వరునకు నమస్కరించి దీనవదనులై
నిలిచిన విద్యాధరదంపతులం గనుంగొని భృగుమహాముని యి
ట్లనియె.

145


క.

ఎవ్వలననుండి వచ్చితి
వెవ్వలనికిఁ బోవు చిటకు? నెవ్వరు నీపే?
రివ్వామనయన యేమగు?
నివ్వగ నీకేల గలిగె? నింతయుఁ జెపుమా!

146


వ.

అనిన విద్యాధరుం డిట్లనియె.

147
  1. శతయోజనాయతంబును షోడశయోజనవిస్తారంబును (హై)