పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

30

పద్మపురాణము


చ.

చని చని కాంచెనంత మునిసత్తముఁ డున్నతశృంగజాలమున్
జనిమరణాదిదూరగణశంకరధారణనిత్యశీలమున్
వినుతయశోవిశాలమును విశ్రుతదివ్యమహీజజాలమున్
వనజభవాదిదేవమునివర్ణితహేలము రౌప్యశైలమున్.

138


ఆ.

అనఘ! తన్మహీధ్రమునకుఁ బశ్చిమదేశ
మున ననేకచారుకనకరత్న
మయశిలాఢ్యమైన మణికూట మను గిరి
కలదు తద్విశేషఘనత వినుము.

139


ఆ.

అంతరాంతరముల హైమరేఖాంకిత
మై సమస్తనిలయమైన యద్రి
మెరసియుండుఁ జూడ మృదుతటిల్లతికాస
మేతమైన నీలమేఘ మనఁగ.

140


క.

శిరము వినీలంబై మొద
లురుకాంచన [1]మయతఁ దేఱి యొప్పు మహీభృ
ద్వర మమలపీతవస్త్రం
బరుదుగ ధరియించునట్టి యచ్యుతుభంగిన్.

141


ఆ.

[2]దివ్యవృక్షములును దివ్యౌషధంబులు
గలయ బెరసి యద్రి పొలుపుమీఱి
రాత్రులందు మిగులఁ బ్రజ్వరిల్లుచు లీలఁ
జెలఁగు దావదహనశిఖరివోలె.

142


వ.

మఱియునుం దదీయకమనీయతటమకుటస్థితవిద్యాధరబృందం
బును గుహాగృహసమాసీనాంతర్నియమితమరుదనేకపరమయోగి
నికాయంబును మందారకుసుమామోదసురభీకృతదశదిశాభాగం
బును పారావతచకోరకీరమయూరమరాళప్రముఖనిఖిలవిహగ

  1. సానుతతుల నొప్పి ..... ధ్వరము ఘనపీత ... ధరించి యున్న (హై)
  2. దీప (తి)