పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-ప్రథమాశ్వాసము

25


క.

వ్యాధులును గూడి దిశలు ని
రోధించిరి వలలు పన్ని రోషంబున దు
స్సాధమగు వనములో బహు
సాధనములు పూని యధికసంరంభమునన్.

110


వ.

అంత.

111


చ.

తెలతెల వేగువేళఁ బఱతెంచె వరాహసమూహ ముగ్రతం
దలకొని నేలమట్టవియఁ దట్టుచు ముట్టెల ముస్త లొత్తుచుం
జెలఁగుచు ఘుర్ఘురధ్వనులు సేయుచుఁ దత్తటమెల్ల దారయై
లలిఁ బెనుఁ జీకువాలు మరలం జనుదెంచె ననంగ దట్టమై.

112


వ.

అప్పు డక్కలకలం బాలించి.

113


క.

[1]కొడతములు విచ్చి కుక్కల
విడుచుచుఁ బెనువలల నిగుడ విప్పుచుఁ గడఁకన్
వెడవెడ నార్చుచు నఱిముఱిఁ
గడువడి వలవేఁటకాండ్రు గనిసిరి పెలుచన్.

114


క.

అల [2]నృపుఁడు తరువు దిగి వెస
వలలకు లోబడక పాఱు వాలుమృగములం
బలుతూపులఁ బడ నేయుచుఁ
జులుకనఁ బొలియించెఁ బెక్కుసూకరసమితిన్.

115


వ.

మఱియు ననేకప్రకారంబులగు మృగంబుల వధియించి వేఁట
చాలించి యధికోత్సాహసంపన్నంబగు భటనికాయంబు బలసి
చనుదేర మృగావలి నోసరించి.

116


క.

భూపాలకుండు మృగముల
నేపున మోపించుకొనుచు నెసఁగఁగఁ దత్తీ
రోపాంతవనము వెడలి ప్ర
తాపంబునఁ బురము కరుగఁ దలఁపఁగ నంతన్.

117
  1. నడికియలు డుస్సి (తి-హై)
  2. లలి (మ), నలి (తి-హై)