పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12

పద్మపురాణము


గువలయామోదకరుండై రత్నాకరుండునుం బోలె బహుజీవనో
దయస్థానంబై విలసిల్లు [1]వెలిగందల కందనామాత్యుం డొక్క
నాఁడు నిజసభామండపంబున నిఖిలవిద్వజ్జనసరసకవిగాయక
కామినీజనపరివృతుండై తారకాగ్రహమధ్యంబునం బొల్చు
చంద్రుచందంబునం జెలువొంది సకలపురాణేతిహాసగోష్ఠీవినో
దంబులం బ్రొద్దుపుచ్చుచుండి సప్తసంతానంబులందు నుత్తరోత్త
రంబులగు కీర్తిసుకృతంబులకు మూలంబు గృతిపతిత్వంబ కా
నిశ్చయించి యష్టాదశపురాణంబులందు సాత్త్వికంబును బరమ
ధర్మార్థకామమోక్షప్రదంబును విష్ణుకథాప్రధానంబు నగు పద్మ
పురాణంబు తెనుంగు [2]చేయింపం దలంచి.

53


క.

ఆ పరమేశ్వరమకుట
వ్యాపితగంగాప్రవాహవరకవితాస
ల్లాపుఁ డగు మడికి సింగనఁ
జేపట్టక కీర్తిగలదె [3]శ్రీమంతులకున్.

54


చ.

అని పొగడంగఁ బెంపెసఁగు నయ్యలు మంత్రికి సింగమాంబకుం
దనయుని విష్ణుమంగళకథాసుముఖాత్ముని నిత్యసౌమ్యవ
ర్తనుని సుశీలు నవ్యకవితారసపోషణవాగ్విలాసు భూ
జనసుతు సింగనార్యు గుణసాగరు నన్ బిలిపించి యర్మిలిన్.

55


వ.

దరహసితవదనుం డగుచు నత్యంతగౌరవంబునం గనుంగొని
యమ్మంత్రిచంద్రుం డిట్లనియె.

56


ఉ.

నీ సహవాససౌఖ్యముల నెమ్మిఁ జరించుటఁ జేసి దిక్కుల
న్వాసికి నెక్కి శిష్టజనవర్గముచేఁ బొగడొంది కావ్యవి
ద్యాసుఖకేళిఁ బేర్చి కడుధన్యతతో బహుదానలక్ష్ముల
న్భాసురకీర్తిమై నెగడి ప్రస్తుతి కెక్కితి మర్త్యకోటిలోన్.

57
  1. వెలిగందలామాత్యుం (ము)
  2. చేయం దలంచి (ము)
  3. శ్రీమంతునకున్ (ము)