పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-ప్రథమాశ్వాసము

13


వ.

అట్లు గావున.

58


క.

కృతిపతుల కీర్తి దిక్కుల
[1]నతులితమై యునికిఁ జేసి యనవరతంబున్
మతి వాంఛ గలదు నన్నుం
గృతిపతిఁ గావింపు పెంపుఁ గీర్తియు నెగడున్.

59


వ.

అది యెట్లంటేని.

60


సీ.

పొలుపారుచున్న యీ భువనత్రయమునందు
       నమరలోకము సారమైన యట్లు
[2]విశ్వపూజ్యం బైన వేదత్రయమునందు
       నమర సామము సారమైన యట్లు
కీర్తిఁ బెంపారెడి మూర్తిత్రయమునందు
       నంబుజాక్షుఁడు సారమైన యట్లు
సౌభాగ్యమయమైన శక్తిత్రయమునందు
       నబ్జవాసిని సారమైన యట్లు


తే.

అవని పద్మంబు ఖండత్రయంబు నందు
సర్వసారాంశమై పుణ్యజనక మగుచు
మండితంబైన యుత్తరఖండ మీవు
తెనుఁగు గావింపు నా పేర ననఘచరిత!

61


తే.

బాదరాయణముని ముఖప్రభవ మైన
యి ప్పురాణార్థ మిలఁ గొంద ఱెఱుఁగ నేర
కుండ నేటికి [3]నాంధ్రభాషోక్తిఁ దెలియఁ
జెప్పి లోకోపకారంబు చేయవలయు.

62
  1. నతిశయమై ......... కృతివాంఛ గలదు నన్నుం, గృతిపతి గావించు నాకు గీర్తి యు (హై)
  2. త్రిజగదధిపమైన దేవత్రయమునందు నమరు శ్రీహరి సారమైన యట్లు (1), కడుపావనంబైన గంగా త్రయమునందు నమరు జాహ్నవి సారమైన యట్లు (2) (తి)
  3. నంధ్ర (హై)