పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-ప్రథమాశ్వాసము

11


క.

కందనమంత్రికి నెన సం
క్రందనమంత్రియును దైత్యగణమంత్రియుఁ గా
కెందును గార్యవివేకము
పొందెఱుఁగని [1]మంత్రిజనులఁ బోల్పఁగ నగునే?

48


ఆ. వె.

ఆతని ధర్మభార్య లత్యంతసౌభాగ్య
వతులు సతతదానరతలు ఘనలు
మల్లమాంబ కాచమాంబిక లనఁ బొల్తు
రెల్లసంపదలకు నెల్ల లగుచు.

49


క.

ఆతని తమ్ముఁడు నూతన
[2]చేతస్సంభవుఁడు ధర్మచిత్తుఁడు సుగుణో
పేతుఁడు నీతికళాగమ
చాతుర్యోన్నతుఁడు మంత్రిసచివుఁడు పొలుచున్.

50


ఆ. వె.

మంత్రివిభుఁడు నితిమతముల దేవతా
మంత్రిఁ బోలు దైత్యమంత్రిఁ బోలు
సరసవాక్స్వరూపసౌందర్యలీలల
బాణుఁ బోలుఁ బంచబాణుఁ బోలు.

51


చ.

తగవుల జన్మభూమి యుచితంబుల నిల్కడ పుణ్యరాశి సో
యగముల కాశ్రయంబు వినయంబుల యిక్కవివేకరాశి మ
చ్చికలకుఁ బట్టుఁగొమ్మ గుణసింధువు గీర్తినివాస మంచుఁ జె
న్నుగ నుతియింతు రబ్బయతనూభవు మంత్రి నమాత్యశేఖరున్.

52


వ.

అని ప్రశంసింపం బరఁగి యన్నదమ్ము లందఱును దీర్ఘాయురై
శ్వర్యసంతానపరంపరాభివృద్ధిసంపన్నులయి ప్రవర్తిల్లుచుండ
బంధుజనముక్తావళీమధ్యరత్నంబును వాణసకులరత్నాకర
సుధాకరుండును నిఖిలదిగ్భరితకీర్తివిలాసుండును నై మందారం
బునుం బోలె సకలవిబుధాశ్రయంబై సుధాకరుండునుం బోలెఁ

  1. మంత్రివరుల (ము)
  2. చేతోభవుఁ డఖిలధర్మ (మ)