పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8

పద్మపురాణము


మ.

మతివాచస్పతి పుణ్యవర్తనుఁడు సన్మాన్యుండు నీతిజ్ఞుఁ డు
న్నతవంశాఢ్యుఁడు విష్ణుభక్తుఁ డభిమానప్రాభవారూఢుఁడై
పతిభక్తి న్దగుమన్నన ల్గని మహాప్రాజ్ఞుండు నా నొప్పె నీ
క్షితిలో గన్నయ యౌబళార్యుఁడు గుణశ్రేష్ఠుం డుదారస్థితిన్.

34


చ.

అతఁ డిలఁ గేసనార్యుని వరాత్మజ సన్నుతభాగ్యలక్ష్మణా
న్విత ననురక్త నుత్తమపవిత్రచరిత్ర దయానుకూల సూ
నృతమితభాష నాఁగ ధరణిం బొగడొందిన గౌరమాంబ నం
చితమతిఁ బెండ్లియయ్యె గుణశేఖరుఁ డబ్బయమంత్రి యర్మిలిన్.

35


క.

ఆ రమణీరమణులకును
గారవమునఁ బుట్టి రధికకల్యాణులు వి
స్తారోదారమనస్కులు
నారాయణుభుజములట్ల నలువురు తనయుల్.

36


క.

వారలలోపల నగ్రజుఁ
డారూఢగుణాభిరాముఁ డతులితవిద్యా
పారగుఁడు ధర్మశీలుఁడు
ధీరుఁడు నా నతిశయిల్లెఁ దిమ్మన జగతిన్.

37


వ.

తదనుసంభవుండగు కేసనామాత్యు గుణంబు లెట్టివనిన.

38


సీ.

తననీతి ముప్పడి ధరణీశుఁ డేలెడి
       ధరణికి వజ్రపంజరము గాఁగ
[1]దనమంత్ర ముద్దండదండనాయకులకుఁ
       బంబిన వాగ్బంధనంబు గాఁగఁ
దనదానసంపద ధారుణీసురులకుఁ
       జెలువారఁ బండినచేలు గాఁగఁ
దనకీర్తి దిగ్వధూధమ్మిల్లములమీఁద
       మహనీయపుష్పదామములు గాఁగఁ

  1. తన మంత్రములు సముద్దండనాయకులకు (ము)