పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-ప్రథమాశ్వాసము

7


గాడియును గల్పించె ని ట్లధికదానసంపన్నుం డగు నాగన్న
సచివునకు గౌరమాంబయం దనేకతనయు లుదయించి రం దగ్ర
జుండు.

28


ఉ.

ఆ శతమన్యువైభవుఁ డహర్పతితేజుఁడు చంద్రచంద్రికా
కాశసమానకీర్తియగు గౌరమ మల్లనమంత్రి దిక్కులన్
వాసికి నెక్కి భక్తి ననివారణమై గుడి గట్టెఁ గట్టి రా
మేశుఁ బ్రతిష్ఠఁ జేసె నుతికెక్కఁగ నామొలగూరివాకిటన్.

29


వ.

ఇ ట్లనూనభాగ్యసంపదలం బ్రవర్తిల్లు మల్లనామాత్యునకు గౌర
మాంబికయందు గణపతియును గోపనయును రామనయును
[1]మంత్రి గన్ననయు ననంగా నలువు రుదయించి రందుఁ
 బ్రథమపుత్త్రుండు.

30


క.

గుణముల రఘుపతి యనుచును
రణముఖమునఁ బార్థుఁ డనుచు [2]రాజిల్లు కవుల్
ప్రణుతి యొనర్పఁగ వెలసెను
గణపతి కామార్థసిద్ధిగణపతి యనఁగన్.

31


క.

ఆ గణపతి విభుపత్ని ద
యాగరిమను నుచితనిర్మలాచార సదా
భ్యాగతపూజాగుణముల
నా గౌరమఁ బోలె గౌరమాంబిక వెలసెన్.

32


వ.

వార లిరువురకు వేదత్రయంబుమం బోలె మల్లనయు నబ్బయా
మాత్యుండును మంత్రియు ననంగాఁ బుత్త్రత్రయం బుదయించె నందు.

33
  1. మంచెనయు గన్ననయు ననంగా నేవు రుదయించి (తి)
  2. రాగిలు సుకవుల్ (మ-తి)