పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6

పద్మపురాణము


రాందోళికాదిచిహ్నంబులం బెంపొందు కందనామాత్యు వంశావ
తారం బెట్టిదనిన.

21


క.

శ్రీ నారాయణునాభి న
నూనం బగు తమ్మి నలువ యుదయించెం దా
నా నిఖిలగురుని వలనను
భూనుతుఁడు మరీచి పుట్టెఁ బొరి నాతనికిన్.

22


తే. గీ.

కశ్యపబ్రహ్మ యన జగత్కర్త పుట్టె
నతని తనువున నుదయించె నఖిలజగము
నతని గోత్రజులందుఁ బెంపతిశయింప
వాణసాన్వయ మొప్పారె వసుధమీఁద.

23


క.

ఇల వాణసవంశంబున
జలరుహభవనిభుఁడు నీతిచాణక్యుఁడు నాఁ
జెలు వమరు రుద్రసచివుఁడు
మొలగూ రేలుచును సౌఖ్యమునఁ జెలువొందున్.

24


క.

ఆతనికి నన్నమాంబకుఁ
బూతగుణోజ్జ్వలులు లోకపూజ్యులు పుత్త్రుల్
బాతిగ గన్నయ రుద్రయ
పోతయ మల్లయ లనంగఁ బుట్టిరి వరుసన్.

25


వ.

అం దగ్రనందనుం డగు గన్నయామాత్యుండు.

26


చ.

వరువడిఁ గాకతీయ గణపక్షితినాయకు నొద్ద మాన్యుఁడై
ధరణిఁ బ్రశస్తుఁడై నెగడి దానములెల్లను జేసి భక్తి పెం
[1]పిరవుగ గుళ్లు గట్టి గణపేశ్వరదేవుని గోపికాధిపున్
దిరమగుచున్న లక్ష్మిని బ్రతిష్ఠలు చేసెఁ బ్రభుత్వ మేర్పడన్.

27


వ.

మఱియు నమ్మొలగూరి పడమటి గవనియందు రుద్రసముద్రం
బనం దమతండ్రిపేరిట నగాధనిర్మలజలపూరంబగు బావియును

  1. పెరవుగ (ము)