పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-ప్రథమాశ్వాసము

9


తే.

గోరి భూజననయనచకోరములకుఁ
దనవిహారంబు వెన్నెలతనుపు గాఁగ
నురుతరైశ్వర్యలీలల నొప్పుచుండ
[1]మంత్రివరుఁడైన కేసనమంత్రివిభుఁడు.

39


చ.

అతులితలీలఁ గేసనచివాగ్రణి ధర్మపురంబునందు నం
చితముగ నన్నసత్ర మిడి శ్రీనరసింహున కుత్సవంబులున్
సతతమహోపహారములు సల్పుచు రామగిరీంద్రమందు సు
స్థితి గుడిగట్టి విష్ణునిఁ బ్రతిష్ఠ యొనర్చె నుదాత్తసంపదన్.

40


వ.

[2]అదియునుం గాక.

41


మ.

అనఘాత్ముల్ మును పెక్కుభంగుల ధనం బార్జించి పాతాళమం
దెనయం బాఁతుదు రూర్ధ్వలోకముల కంచేయూరి కేత్రోవరా
యని మా కేసనకేశవేంద్రుగుడిపై నాచంద్రతారంబుగా
నినతుల్యంబగు హేమకుంభశిఖరం బెత్తించె నత్యున్నతిన్.

42


వ.

మఱియును బహువిధంబులగు దానధర్మంబులను విలాసనీతి
చాతుర్యవిద్యావినయంబులను ననురక్తుండై ముప్పడి క్షోణిపాలు
నశేషరాజ్యభరణోద్ధరణపారీణుండును సపుత్త్రపౌత్త్రప్రవర్ధ
మానుండు నగు కేసయామాత్యు కూర్మితమ్ముండు.

43


సీ.

స్వామిభక్తుఁడు గార్యచతురుండు బహుకళా
       వేది నీతిజ్ఞుండు విప్రహితుఁడు
సరససల్లాపుండు సప్తాంగరక్షణ
       క్షముఁడు భావజ్ఞుండు సర్వసులభుఁ
డరిమంత్రభేదనపరుఁడు ధర్మాత్ముండు
       సుందరాకారుండు సుజనవినుతుఁ
డురుదయాపరుఁడు నిత్యోత్సవాసక్తుండు
      షడ్గుణాధారుండు సౌమ్యమూర్తి

  1. మంత్రిమణియైన (మ-తి)
  2. అట్లుం గాక (ము)