పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-ప్రథమాశ్వాసము

3


తే. గీ.

[1]నర విభీషణ సనక సనంద కపిల
వాయునందన శేషాహి వైనతేయు
లాది యగు భాగవతులను నాళువారిఁ
బరమభక్తిఁ దలంపుదుఁ బ్రతిదినంబు.

10


క.

ధర నిహపరములకును గురు
చరణంబులె యూఁత యగుటఁ జర్చించి మదిం
బరవాది భద్రవారణ
హరి ముఖ్యులఁ దిరుమలయ్య లార్యులఁ [2]దలఁతున్.

11


వ.

అని యాశీర్వచనపూర్వకంబుగా నఖిలలోకనియామకులై యాఢ్యు
లైన సరసిజోదర సర్వజ్ఞ శతానందులఁ దలంచి నమస్కరించి
యనంతరంబ సరస్వతి వినాయక ప్రార్థనంబును సూర్యపదారాధ
నంబును బురాణకవి ముఖ్యోపాసనంబును బరమభాగవతసంకీర్త
నంబును గురుచరణస్మరణంబునుం జేసి కృతకృత్యుండనై
యొక్కపుణ్యప్రబంధంబు రచియింపం బూని తత్కవితావధూ
ముఖతిలకం బగు వెలిగందల కందనామాత్యుం డను నుత్తమ
రత్నంబున కుపాశ్రయం బగు రామగిరి పట్టాణాధీశ్వరుండైన
ముప్పడి క్షోణిపాలుని యన్వయగుణవిశేషంబు లెట్టి వనిన.

12

కృతినాయక వంశావతారాభివర్ణనము :

మ.

గురిజాలాన్వయదుగ్ధవార్ధిశశిదిక్కుంభీంద్రహస్తాభబం
ధురభూభారధురీణనిశ్చలమహాదోర్దండుఁ డుగ్రారి భీ
కరుఁడై దిక్పరివర్తికీర్తి నెగడంగా భూరిభోగాఢ్యుఁడై
పరఁగెన్ ధాత్రిఁ దెలుంగురాయఁడు జగత్ర్పఖ్యాతరాజ్యోన్నతిన్.

13
  1. నరు విభీషణు సనకు సనందుఁ గపిలు (ము)
  2. గొలుతున్ (ము)
    ము=ముద్రితప్రతి - పువ్వాడ వెంకటరావు పంతులు ప్రకటనము 1885