పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4

పద్మపురాణము


చ.

అతనికి నగ్రభార్య వినయాంచిత నిత్యశుభైకశీల సు
వ్రత నియతాత్మ సజ్జనపరాయణ ధర్మవివేకసార[1]
మ్మతహృదయానుకూల గుణమండన నాఁదగు మల్లమాంబయం
దతులితరామలక్ష్మణశుభాకృతు లిద్దఱు పుట్టి రాత్మజుల్.

14


వ.

అం దగ్రసంభవుండు.

15


క.

శ్రీకరుఁడు సకలభువనవ
శీకరుఁ డతికీర్తియుతుఁడు చిరతరగుణర
త్నాకరుఁడు సతతదానద
యాకల్పుఁడు ముప్పడి క్షమాధీశుఁ డిలన్.

16


వ.

మఱియును.

17


సీ.

కమఠాహికోలదిక్కరులరాయిడి మాని
       యీవీరుభుజశక్తి నెసఁగె ధాత్రి
కలి నొక్కపాదమై కదలనేరని ధర్మ
       మీపుణ్యుఁ డూఁతగా నిలఁ జరించె
వెడఁగు రాజులచేత నడఁగిన కీర్తి యీ
       నృపచంద్రు మన్నన నింగి ముట్టెఁ
గర్ణాది నృపులతోఁ గడ చన్నదాన మీ
       [2]జగతీశ్వరునిచేత మగుడఁ బుట్టె


ఆ. వె.

ననుచుఁ బొగడనేలె నఖిలంబు గురిజాల
గోత్రవార్ధికుముదమిత్రుఁ డన్య
రాజమకుటకలితరత్నరంజితపదాం
బుజుఁడు తెలుఁగునృపతి ముప్పవిభుఁడు.

18


([3]వ.

తదనుజన్ముండు.)

  1. సన్నుత (ము) యతిభంగము
  2. మానవేశ్వరుచేత (హై). హై=హైదరాబాదు ప్రతిపాఠములు
  3. (హై-మ). మ=మద్రాసు ప్రాచ్యలిఖిత భాండాగారము - సి పి. బ్రౌను పాఠములు.