పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

37

Flyleaf పై గల బ్రౌనుగారి అభిప్రాయం :

The Padma Purana Part Second Translated into Telugu by Ayyalacavi Singana. This is a very popular work among the Telugus and manuscripts are very common in the Northern districts. The Purvabhagam or First part of this Purana does not seem to have been translated into Telugu. A Zamindar in Rajahmundry told me that he had in vain tried to discover a copy of it and believed that it never has been translated. The present copy has been collated with four manuscripts and is perfect. The language used in this translation is easy and very beautiful.

బ్రౌనుగారు సిద్ధం చేయించిన ప్రతిలో ఇంతకుపూర్వం ఉదాహరించిన మంగళమహాశ్రీ వృత్తంకూడ ఉన్నది. బ్రౌను ప్రతితోపాటు తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రాచ్యపుస్తకభాండాగారంలోని D 23, D 25, R 379 తాళపత్రప్రతులను, హైదరాబాదు ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని తాళపత్రప్రతిని పాఠాంతరాలకోసం సంప్రదించినాను. 1885 ముద్రితప్రతి పాఠాలు 'ము' సంజ్ఞతోను, బ్రౌను మద్రాసు పాఠాలు 'మ' సంజ్ఞతోను, తిరుపతి పాఠాలు 'తి' సంజ్ఞతోను, హైదరాబాదు పాఠాలు 'హై' సంజ్ఞతోను సూచించినాను. మేల్తరములని తోచిన పాఠాలను గ్రంథభాగంలో చేర్చి మిగిలినవానిని అధోజ్ఞాపికలం దిచ్చినాను. తాళపత్రగ్రంథాల్లో లభించిన అధికపాఠాలు అధోజ్ఞాపికల్లోనే చేర్చినాను. అవసరమైన సంధి వచనాలను గ్రంథభాగంలోనే చేర్చినాను. ఇన్నిప్రతులు సంప్రదించినందుకు ముద్రితప్రతిలోని అనేక అhపాఠాలు గుర్తించగలిగినాను. ఈ ప్రతులు సంప్రదించటానికి అనుమతించిన మద్రాసు తిరుపతి హైదరాబాదు గ్రంథాలయాధికారులకు సహకరించిన మిత్రులకు, గ్రంథమును ముద్రించిన తిరుమల తిరుపతి దేవ