పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

32

ఉద్దవునితో గోపికలు అన్యాపదేశంగా అన్న మాటలు:

చంచరీకమ నీవు చంచలాత్ముఁడవు
వంచకుండవు పుష్పవతులఁ గీలింతు
నిలిచిన కాలున నిలువదే ప్రొద్దు
మలినాంగుఁడవు దానమహిమ కాసింతు.

నెచ్చోటికై నను నేఁగుదు గాని
మచ్చిక కల్గునా? మరియొల్ల; నీవు
పక్షపాతివి నీవు బహుచుంబకుఁడవు
వీక్షింప నివి నైజవిద్యలు నీకు.

ఏలయ్య మధుకర ఈ పుష్పరసముఁ
గ్రోలెడు వేడుకఁ గులకాంతమీఁద
నెయ్యంబు వదలెడు నినుఁ బాసి యంత
దయ్యదే నొవ్వదే దర్పకుఁ జేత.

ఉద్ధవుడు గోపికలను ఈ విధంగా ఊరడిస్తాడు!

దానతపోధ్యానధర్మవర్తనల
కైనను గలుగ దీ హరిభక్తి పెంపు
తనయులఁ బతులను తల్లిదండ్రులను
యనుఁగుల జుట్టాల నందఱ విడిచి

హరియందు మర్ములు నైతిరిగాన
నిరవార మీ భాగ్య మేమని చెప్ప!
హరి వేడ్క మీతోడ ననుమన్న పలుకు
వెరవేది చెప్పెద వినుఁడు ఇందఱును

సర్వేంద్రియంబులు సమతఁ బోషించు
నిర్వికల్పజ్ఞాననిధియైన నన్ను
విరహాగ్నినెపమున వెలుపల మఱచి
పరమయోగధ్యానపరులచందమున