పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

31


ఈతఁడే యెలనాగ! ఇసుమంతనాఁడు
పూతన పాల్ద్రావి పొరిగొన్నవాఁడు
సకియరో! ఈతఁడే శకటమై వచ్చు
ప్రకటదానవుఁ ద్రుళ్ళిపడఁ దన్నినాఁడు

ముద్దియ! ఈతఁడే మొగి ఱోలుఁ ద్రోచి
మద్దుల నుడిపిన మహనీయయశుఁడు
అక్కరో! ఈతఁడే యఘదైత్యుఁ జీరి
కొక్కెరరక్కసుఁ గూల్చినవాఁడు

గోవర్దనముఁ గేల గొడుగుగాఁ బట్టి
గోవులఁ దేర్చిన గోవిందుఁ డితఁడె
కొమ్మ! ఈతఁడె పిల్లగ్రో వూది వ్రేత
కొమ్మలఁ గడువెఱ్ఱి గొలిపినవాఁడు.

ఈ సందర్భంలో పోతన పద్యం ఇట్లా ఉన్నది:

సీ.

వీఁడటే రక్కసి విగతజీవగఁ జన్నుఁ
       బాలు ద్రావిన మేటి బాలకుండు
వీఁడటే నందుని వెలఁదికి జగమెల్ల
       ముఖమందుఁ జూపిన ముద్దులాఁడు
వీఁడటే మందలో వెన్నలు దొంగిలి
       దర్పించి మెక్కిన దాఁపరీఁడు
వీఁడటే యెలయించి వ్రేతల మానంబు
       చూఱలాడిన లోకసుందరుండు


గీ.

వీఁడు లేకున్న పుర మటవీస్థలంబు
వీనిఁ బొందని జన్మంబు విగతఫలము
వీనిఁ బలుకని వచనంబు విహగరుతము
వీనిఁ జూడని చూడ్కులు వృథలు వృథలు.

(I-1248)