పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

33


పరమానురక్తి హృత్పద్మంబులందు
చిరలీల నిలిచి భజించుటఁ జేసి
మీ తలంపులయందు మెలఁగుదు గాని
మీతో వియోగ మేమియు లేదు మాకు

నిచ్చట పనిఁ జూడ నెఱిఁగి మీ కడకు
వచ్చెద ననియె న వ్వసుదేవతనయుఁ
డని చెప్ప నుద్ధవాచార్యునిఁ జూచి
మనసిజోన్మాదలై మగువ లిట్లనిరి.

మడికి సింగన మూడవకృతి వాసిష్ఠరామాయణం. దీనికి మూలం వాల్మీకివిరచిత యోగవాసిష్ఠం. దీనికి జ్ఞానవాసిష్ఠ మని మరొకపేరు. వసిష్ఠుడు శ్రీరామునికి బోధించిన తత్త్వజ్ఞాన మిది. ఇందులో వైరాగ్య, ముముక్షు, ఉత్పత్తి, స్థితి, ఉపశమన, నిర్వాణము లనే ఆరు ప్రకరణాలలో 32 వేల శ్లోకా లున్నవి. విశ్వతత్త్వాన్ని ఆకళించుకొని ఆత్మశాంతి పొందటానికి పరమసాధనమైన ఈ వాసిష్ఠరామాయణంలో ఆసక్తిదాయక మైన అనేక ఆఖ్యానా లున్నవి. ఇ దొకవిజ్ఞానశాస్త్రకోశం. ఆత్మజ్ఞానమూ ముక్తి కోరేవా రందరికి అవశ్యపఠనీయగ్రంథ మిది. మడికి సింగన ఆరు ప్రకరణాలను ఐదు ఆశ్వాసాలకృతిగా 1217 గద్యపద్యాలలో అనువదించినాడు. ఇందులో 39 ఆఖ్యానా లున్నవి. అహోబలనృసింహునికి అంకితమైన ఈ కృతి తెలుగువాఙ్మయంలో తొలివేదాంతకృతి. కవి ప్రతిజ్ఞలో—

క.

మృదుమధురరచనఁ గావ్యము
గదియించిన యట్ల తత్త్వగాఢార్థము చె
ప్పుదుఁ బువ్వుఁదేనె గొను తు
మ్మెద మ్రోడులు దొల్పు నేర్పు మెఱసినభంగిన్.

(I-14)


క.

ఇది యల్పగ్రంథం బని
మదిఁ దలఁపకు డఖిలశాస్త్రమతములు దీనన్
విదితంబగు నద్దములో
మదదంతావళము దోఁచుమాడ్కిని దెలియన్.

(I-15)