పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

27


నధిపతి తొయ్యేటి యనపోతభూపాలు
       మంత్రియై ప్రాజ్యసంపదలఁ బొదలి
యొప్పార గౌతమి యుత్తరతటమున
       మహనీయమగు పెద్దమనికియందు


గీ.

స్థిరతరరామతతులు సుక్షేత్రములును
బెక్కు లార్జించి సితకీర్తిఁ బెంపు మిగిలి
యఖిలజగదన్నదాతనా నవని బరఁగె
మధురగుణధుర్యుఁ డయ్యల మంత్రివరుఁడు.

(I-33)


చ.

ఒనరఁగ నవ్వధూవరు లహోబలదేవునిఁ గొల్చి తద్వరం
బున నొగి సింగనార్యుని నమోఘగుణాఢ్యు ననంతుని న్మహీ
జననుతు నోబయాంకు బుధసన్నుతిపాత్రుని నారయాహ్వయుం
గని నరసింహనామములు గారవమారఁగఁ బెట్టి రందఱన్.

(I-34)


క.

వారలలో నగ్రజుఁడగు
వారిజదళనయనచరణవారిజసేవా
సారమతి నతులవాక్య
శ్రీరచనాచతురమతిని సింగాహ్వయుఁడన్.

(I-35)


క.

కూనయ ముప్పనృపాలక
సూనుశ్రీ తెనుఁగునృపతి సుదతీ మల్లాం
బానందనుఁడగు ముప్పయ
భూనాథుని సుకవివరుఁడ బుధసన్నుతుఁడన్.

(I-36)


గీ.

ఆ మహీవిభుచేత రామాద్రిసీమఁ
బెక్కువృత్తులు గ్రామముల్ వెలయఁ గాంచి
యతని యాశ్రితులందెల్ల నధికుఁ డనఁగఁ
జతురుఁ డన ధన్యుఁ డన సడిసన్నవాఁడ.

(I-40)