పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

26


క.

అంబుజనిభుఁ డాప
స్తంబాగ్రణియైన గుండసచివునకును గొ
మ్మాంబకుఁ బుట్టెను బుత్రయు
గం బొగి నల్లాడవిభుఁడు గంగన యనఁగన్.

(I-26)
(అల్లాడమంత్రి)
సీ.

అతఁడు తిక్కన సోమయాజుల పౌత్రుఁడై (పుత్రుఁడై)
       కొమరారు గుంటూరు కొమ్మవిభుని
పుత్రిఁ జిట్టాంబిక బుధలోకకల్పక
       వల్లి వివాహమై వైభవమున
భూసారమగు కోటభూమిఁ గృష్ణానదీ
       దక్షిణతటమున ధన్యలీల
నలరు రావెలయను నగ్రహారము తన
       కేకభోగ్యంబుగా నేలుచుండి


గీ.

యందుఁ గోవెల గట్టి గోవిందు నెన్న
గోపికానాథుని ప్రతిష్ఠఁ గోరి చేసి
యఖిలవిభవంబులందును నతిశయిల్లె
మనుజమందారుఁ డల్లాడ మంత్రివిభుఁడు.

(I-29)


క.

అయ్యువతీరమణునకును
నయ్యలమంత్రీంద్రుఁ డుదితుఁడై ధారుణిలో
నెయ్యెడ నర్థార్థులు మా
యయ్య యనుచుఁ బొగడ నెగడె నౌదార్యమునన్.

(I-30)


సీ.

ఆత్రేయగోత్రపవిత్ర పేరయమంత్రి
       పుత్రి సింగాబికఁ బుణ్యసాధ్వి
వెలయ వివాహమై వేఁగిదేశంబులో
       నేపారు రాజమహేంద్రపురికి