పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

25


చ.

అని పొగడంగఁ బెంపెసఁగు నయ్యలుమంత్రికి సింగమాంబకుం
దనయుని విష్ణుమంగళకథాసుముఖాత్ముని నిత్యసౌమ్యవ
ర్తనుని సుశీలు నవ్యకవితారసపోషణవాగ్విలాసు భూ
జననుతు సింగనార్యు గుణసాగరు నన్ బిలిపించి యర్మిలిన్.

(I-55)


క.

ధర నిహపరములకును గురు
చరణంబులె యూఁత యగుటఁ జర్చించి మదిన్
బరవాది భద్రవారణ
హరిముఖ్యులఁ దిరుమలయ్య లార్యులఁ గొలుతున్.

(I-11)

II ద్విపద భాగవతం కాండాంతంలో—

శోభితనవరూప సూనాస్త్రుపేర
నౌభళమంత్రి కందామాత్యు పేరఁ
గోరి భరద్వాజగోత్రసంజాతుఁ
డారూఢమతి నయ్యలార్యనందనుఁడు

శృంగారరసకళాశ్రితవచోధనుఁడు
సింగనామాత్యుఁడు చెలు వగ్గలింప
సలలితరసభావశబ్దగుంభనల
వలనొప్ప శ్రీభాగవతపురాణమున

మహనీయమగు దశమస్కంధసరణి
విహితలీలల నొప్ప విష్ణుచారిత్ర
మారూఢభక్తి కల్యాణకాండంబు
నా రవితారార్కమై యుండఁ జెప్పె.

III వాసిష్ఠరామాయణంలో—

ఉ.

ఆ జలజాక్షు నాభిజలజాత్మజు మానసపుత్రుఁడై భర
ద్వాజుఁడు ధాత్రిఁ బెంపెసఁగె దన్మునిగోత్రజులందు నిత్యవి
భ్రాజితపుణ్యమూర్తి యగు బ్రహ్మనమంత్రికిఁ బుట్టెఁ దీవ్రరు
క్తేజుఁడు గుండనార్యుఁడు సుధీజనభూజనకీర్తనీయుఁడై.

(I-23)