పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

24


సీ.

సంపెంగ విరులతో జాజులుం గురువేరు
        కొమరార నును సేసకొప్పు పెట్టి
మృగమదకర్పూరమిళితమో పన్నీరు
        తనుపార మేనఁ జందన మలంది
యుదయభానుప్రభ నుల్లసం బాడెడు
        మణిభూషణస్ఫూర్తి మాటు మలసి
పరపైన వెన్నెల నురువుల పోలికఁ
        దనరారు ధవళవస్త్రములు గట్టి


గీ.

మానినీకరచామరమరుతచలిత
కుంతలుండయి తగ నిండుకొలువునందుఁ
దనువుఁ గీర్తియుఁ గల పుష్పధన్వుఁ డనఁగఁ
జూడ నొప్పారు ముప్పయ క్షోణివిభుఁడు.

(వాసిష్ఠ. I-38)

కృతికర్త వంశము దేశ కాలములు : మడికి సింగన కృతులు 1. పద్మపురాణోత్తరఖండము, 2. భాగవత దశమస్కంధము - ద్విపద, 3. వాసిష్ఠ రామాయణము, 4. సకలనీతిసమ్మతము. మొదటి రెండు కృతులు వెలిగందల కందనమంత్రికి అంకితములు. మూడవకృతి అహోబల నృసింహస్వామికి అంకితము. నాల్గవకృతి రామగిరి కేశవదేవుని కంకితము. ఈ నాలుగు కృతుల్లోను సింగన తన వృత్తాంతం చెప్పుకున్నాడు.

I పద్మపురాణంలో—

క.

ఆ పరమేశ్వరమకుట
వ్యాపితగంగాప్రవాహవరకవితాస
ల్లాపుఁ డగు మడికి సింగనఁ
జేపట్టక కీర్తి గలదె శ్రీమంతులకున్.

(I-54)