పుట:పంచతంత్రి (భానుకవి).pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

అధిప పాథోవాంఛ నరుగుచు నిచ్చట
                    నిలిచిన కార్యమ్ము దెలుపుమనిన,
దమనక! మద్వనాంతరమునన యకాల
                    ఘనఘనాఘనఘోరగర్జతోఁడ
సరిపోలు నొక్కనిస్వానమ్ము విని దాని
                    గమనింప సత్త్వవిఖ్యాతుఁ డిందుఁ
గలడని చెంత నిక్కడ నిల్చియున్నాఁడ
                    [నన విని] యేల భయమ్ము నీకుఁ


గీ.

[1]జెప్పు మల్పు నధికుఁ జేసెద వలుఁగు నీ
రములచేదఁ బోదె, రాజ మంత్ర
రక్ష [లేక నృపతి] రక్షణంబునఁ గార్య
మనఘ! యింత విఫలమగు దలంప.

104


క.

మును మృగధూర్తకకులనా
థునిచేఁ దెలియంగబడిన దుందుభినాదం
బును బోలె నధిప! యేతద్
ధ్వని యిప్పుడు మనకుఁ దెలియదగునని పల్కెన్.

105


వ.

అనిన విని మృగవిభుం డది యెట్లని యడిగిన దమనకుం డాను
పూర్వికంబుగా నెఱింగించువాఁడై యిట్లని చెప్పందొడంగె మున్ను లంబ
కర్ణుండను జంబుకసత్తముం డధికక్షుత్పరవశుండై యొక్కభగ్నవాహినీ
సమీపస్థలంబునఁ గ్రుమ్మరుచు నొక్కనాఁడు వాతాహతభేరీనినాదమ్ము
లాకర్ణించి భయమ్ము నొంది తనయంతరంగమ్మున నిట్లని చింతించె.

106


క.

మిక్కిలి నాఁకటిచేతం
జిక్కితి నీవేళ నేమి సేయుదునొ కదే!
యెక్కడికి బోదునని యం
దొక్క మహాభేరిఁ గనియు నొయ్యన నగుచున్.

107


క.

పవనాహతతరుశాఖా
నివహముచే మ్రోఁగు టెఱిఁగి, నిర్భయుఁ డగుచున్

  1. జెప్పు మల్పు పలుకు జేసెద వధిక నీ