పుట:పంచతంత్రి (భానుకవి).pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్వచ్ఛసుందరమగు నీతిని శైలి బహుస్థలములయం దిట్లు జాలువాఱుచున్నది.

చ.

నృపతి మదోద్ధతుండయిన నేర్పున మంత్రివరుండు రాచకా
ర్యపు సరవుల్ ప్రజావితతి నంటని యాపద, మంచివేళఁ దె
ల్విపడగఁ జెప్పి వాని యవివేకము మాన్పి హితం బొనర్చినన్
విపులయశమ్ము నొందు గుణవిశ్రుత! విఠ్ఠయ లక్ష్మధీమణీ!


చ.

గురు వెలయన్ బ్రధాని, నృపకుంజరు నర్భకురీతి, నీతిశా
స్త్రరుచిరచిత్తుఁ జేసి పరరాష్ట్రసభాజనమెల్ల మెచ్చఁ బెం
పరుదుగ నుండెనేనిఁ దను నత్యధికంబగు నూత్నభోగముల్
సిరియును గీర్తి బొందు నిది సిద్ధము విఠ్ఠయ లక్ష్మధీమణీ!


ఉ.

ఆరసి చూడ రాజు సుకృతాంచితుఁడైనఁ దదీయసేవకున్
గ్రూరపుమంత్రి డాసిన నకుంఠమతిం బ్రజ తల్లడింపుచున్
జేరదు నక్రమున్న సరసింబలె, నుగ్రఫణీంద్రమున్న ధా
త్రీరుహమట్లు వానిఁ గులదీపక! విఠ్ఠయ లక్ష్మధీమణీ!

ప్రయోగవిశేషములు

లక్షణజ్ఞుఁడని పేర్కొనఁబడిన యీ కవి కావ్యమునఁ గొన్ని నీహారలేశములవంటివి, “విష్ణుశర్మను” (విష్ణుశర్మ + అను]మున్నగునదంత తత్సమపదసంధులును, “మేసచ్చట”, “అణఁగున్న" మున్నగు క్త్వార్థకసంధులును గానవచ్చుచున్నవి.

క.

"లాంగూలం బల్లార్చి
మ్రోఁగుచు”

మున్నగు పూర్ణబిందు ఖండబిందు ప్రాసములును,

క.

"ఆకఁట చేతను మీరలు
ప్రాకటఫలసంగ్రహమ్ము”

మున్నగు సబిందు నిర్బిందు ప్రాసములును గానవచ్చుచున్నవి. ఆత్మార్థమున వనుప్రయుక్తమగు “కొను” ధాతు వుండవలసిన స్థలములలోఁ "బుచ్చుక”,