పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దనరి భరతంబును పర్వదూర్వహంబయి భారతంబును సర్వతోరణవిహారంబయి
జయశీలుని విబుధభవనసామ్యంబయి గ్రహమండలంబును రంభాలంకృతంబయి
స్వర్గలోకంబును విశ్రుతావితానవితానంబయి కురుక్షేత్రంబును బ్రతిష్ఠితదధిము
ఖపాత్రంబయి మధువనంబును ననుకరించువివాహమంటపంబు డాయంబోయి.

354


ఉ.

మోహనలీల నంత నొకముద్దియ గద్దియఁ దెచ్చినన్ మహో
త్సాహత భూమిపాలతనుసంభవుఁ డెక్కె ననంతరంబ దీ
నాహితనీతిసంచితగృహార్తుఁ డొసంగె సుకీర్తిభాసుర
వ్యాహృతి కుందనంపుహరిబాణమునన్ మధుపర్క మయ్యెడన్.

355


క.

దానవశాత్రవుఁగా జయ, సేనుని నారాచకూఁతు సిరిగా మది న
మ్మానవపతి దలపోసి య, థానియతిని ధారఁబోసెఁ దనయన్ సనయన్.

356


క.

లగ్నంబు గదిసె గగనవ, లగ్నం దెమ్మనిన బుధులు లలితగతి న్ము
న్మన్నలు గుచభరకించి, ద్భుగ్నలు నగుచెలులు సొంపుతోఁ జని కడకన్.

357


క.

తుద కొప్పు మెఱయ గవిసెన, గదియించినమరునివింటిగతి నతిశయిలన్
దుద కొప్పు మెఱయ నింతికి, ముదితలు చిత్రాంబరమున మునుఁగిడి వేడ్కన్.

358


క.

నడపింపఁగ మడుఁగులపై, నుడురాజనిభాస్య యడుగు లొప్పెం గడున
య్యడుగులు కూర్మము లగునఁట, మడుగులపై బొరయకేల మానఁగ నేర్చున్.

359


ఉ.

[1]మోవవశమ్ము గాని తెలిముత్తెపుసొమ్ములతోడికమ్మపూఁ
దీవలవంటిబోంట్లు కవదివ్వెలతోఁ జెలిఁ దెచ్చి రద్ధరి
త్రీవరపుత్రుఁ జేర నధరీకృతరోహిణి రోహిణిం బ్రమో
దావహజక్క నుక్కుతునియ ల్హరిణాంకునిఁ జేర్చుచాడ్పునన్.

360
  1. శా.రాకాచంద్రనిభాస్య నెచ్చెలులు దేరం బ్రీతి నత్యూర్జిత
         శ్రీకిం బట్టగుమంగళాయతనముం జేరంగ నేతెంచుచోఁ
         గాకల్పారసమత్తకోకిలలజోక న్సూరెలం డాసి ల
         క్ష్మీకల్యాణముఁ బాడి రంతఁ బురహంసీయాన లుప్పొంగుచున్.
    ఈపద్యము గొన్నిప్రతులలోఁ గానఁబడదయ్యెడు.