పుట:పంచతంత్రము (నేలటూరు రాఘవయ్య).pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్కున బొడుచుకతినేకొంగ తనకడుపు నిండించుకోలేదా. అదియునుం గాక కొంచముమెదడు గలకఠినమైన యెముక దొరికినా కుక్క సంతోషపడుచున్నది. అందువల్ల దానియాకలిగూడా తీరదు. సింహమైతే అల్పమృగము సమీపమునకు వచ్చినా దాని విడిచి మదించిన యేనుగను చంపి దానికుంభస్థలమందలి మెదడు భక్షింపగోరును. హీనులు నధికులు నైనసకలమానవులు తమతమబలానుసారము గార్యములు చేయగోరుదురు. అటువలె నీవున్ను నీబలానికి తగినట్లు చేయదలంచితివి. మఱియును కుక్క తనకు ఆహారమిచ్చేవానిదగ్గిర తోక నులుచుకొనును. నేల కాళ్ల నదుమును. భూమిమీద పడి కడుపు నోరు చూపించును. యీప్రకారము యెన్నిపాట్లు పడినా కుక్క కొక్కముద్ద యన్నమే కాని కడుపునిండ పెట్టరు. యేనుగ బహుధైర్యముతో చూచుచుండును. మంచిమాటలతో చెప్పితేనేకాని అహారము తీసుకొనదు. దానికి కావలసినంత ఆహారమిత్తురు. హీనుడైనవాడు ఎంతదీనుడై యడిగినా వానికి యెవరున్ను యివ్వరు. ఒకవేళ యిచ్చినా కొంచమే యిత్తురు. అధికునకైతే వా డడుగకున్నా రాజులు వానికాంక్ష దీర నిత్తురు. ఘనమైనవిద్యచేతను పరాక్రమముచేతను ఉపాయముచేతను రాజులు చూచి మెచ్చ బ్రతికినదే బ్రతుకు గాని నీచపుబ్రతు కెందుకు. కుక్క యల్లప్పుడున్ను తోక యాడించుచు కమికెడుకూడు తిననేతినుచున్నది. పౌరుషముచేత జ్ఞానముచేతను కీర్తిచేతను ప్రసిద్ధి కెక్కినవాని సంపద ఒక్కపూట నిలిచినా చాలును. తనకడుపుమాత్రమే నిండించుకొనేకాకి బహుకాలము బ్రతికియుండినా ఫల మేమి. కొంచంనీళ్లచేత మొరపనేల వాగు పొర్లిపారినట్లు స్వల్పఫలముచేతనే అల్పుడు మిక్కిలిసంతోషమును బొందును. ఇది హితము ఇది హితము కాదు అనేవివేకము లేక అనేకములైన వేదోక్తాచారములును విడిచి తనకడుపుమాత్రమే నిండించుకొనుటయందు యిచ్ఛగలనరుడు పశువుతో సమానుడు. భారముగలబండి నీడ్చుచు గడ్డి మేయుచు మిట్టపల్లములుగా నుండేస్థలములయందు దున్నుదు. నీప్రకారముగా లోకమునకు ఉపకారము చేయుచు పవిత్రమైనపుట్టుక గలవృషభము నరపశువుకంటే అధికము. అనిన విని ఓయీ మనము ప్రధానులము కాము కాబట్టి యేపనులకున్ను అర్హులము గాము. మన కిన్నినీతులతో పని యేమి అని కరటకుడు పలికిన వెండియు దమనకు డిట్లనియె.

పూర్వజన్మమునందు చేసినపుణ్యముచేత బుద్ధిగలవా డగును. బుద్ధిబలము