పుట:పంచతంత్రము (నేలటూరు రాఘవయ్య).pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చేత రాజులచేత పూజ్యుడగును. రాజులు మన్నించుటచేత బుద్ధికి ప్రకాశము గలుగును. అందువల్ల రాజ్యతంత్రము నడుపుటకు ప్రధానుఁడగును. ప్రధానత్వము వచ్చిన సమస్తము గలుగును. అప్రధానుడు ప్రధానుడు కావడానకు యెంతసేపు పట్టును. మరియును నడవడిక మంచిదిగా నుండెనా జనులు వాని గొప్పగా జూతురు. ఆనడవడి చక్కగానిది గాకపోయెనా వానిచుట్టములైనను వాని చుల్కగా జూతురు. గొప్పతనంబును చిన్నతనంబును నడవడికచేత వచ్చును. ఒకపెద్దరాయి మహాప్రయత్నముచేత కొండమీదికి తీసుకొనిపోవుట ప్రయాసము. ఆరాయి అక్కడినుంచి కిందికి తోయుట సులభము. అటువలెనే మంచిగుణములు గలవాడఃని పొగతొండుట కష్టము. దుర్జనుండని పేరు దెచ్చుకొనుట సులభము.

అని చెప్పగా కరటకుండు విని ఓయీ మంచినీతివాక్యములు వివరించితివి. నామనస్సులో సంశయము తీరెను. ఇపుడు నీ వేమి చేయదలంచితివో అది చెప్పుమనిన దమనకుం డిట్లనియె.

బలంబును పరాక్రమంబును ధైర్యంబును గలమనరాజు నీళు దాగుటకై నదికి పోయి రేవులో దిగక వెరచియున్నాడు. అది నీ వె ట్లెరింగితివంటివా వినుము. ఏకార్య మైనా భావజ్ఝులైనవారికి విశదమై యుండును. పశువులు ఒకరు చెప్పినమాటలు విని వారు చెప్పిన ప్రకారము ప్రవర్తించును. గుఱ్ఱములు, ఏనుగలు శిక్షలచేత నొకరివశంబై వారిని తమమీద నెక్కించుకొని తిరుచుండును. పండితుడైనవాడు ఒకరు చెప్పనితాత్పర్యమును ఊహింపుచు పరులయింగితమును దెలుసుకోవడమే బుద్ధి గలుగుటకు ఫలము. బుద్ధి లేనివారు దైవమునే చింతించి తమప్రయత్న మేమిన్ని జరిగించకయుందురు. అటువంటివారు భూమియందు బుట్టి యేమి ప్రయోజనము. ఈలోకములో పరులయింగితము తెలుసుకోలేనివానిజన్మ మెందుకు. కాబట్టి యిప్పుడు నేను రాజుదగ్గిరికి పోయి నామీద అతనిమనస్సు వచ్చునట్లుగా కొలిచి అతనిచేత మన్ననలం బొందెదను,

అనిన విని ఓచెలికాడా నీవు మున్ను రాజుల సేవించినవాడవు కావు. వారిచిత్తవృత్తి తెలిసి యెట్లు మెలగనేర్తు వని కరటకుం డడిగిన దమనకుడు మరల నిట్లనియె.

మిక్కిలిసమర్థులైనవారికి అసాధ్య మొకటి కలదా. ఉద్యోగము సేయ నేర్చినవానికి దూరభూమి గలదా. విద్యలు నేర్చినవారికి పరదేశ మొకటి గలదా. ప్రియవాదు లైనవారికి శత్రువులు గలరా. కాబట్టి మనరాజు మన్నించును