పుట:పంచతంత్రము (నేలటూరు రాఘవయ్య).pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సేవకులతోకూడా పోయి న న్నెరిగించుకొని అతనిసమీపము విడువక అనుసరించియుండెదను. రాజులున్ను స్త్రీలున్ను తీగెలున్ను యెల్లప్పుడు తమసమీపము విడువనిఆశ్రితులను గ్రహింతురు గాని వీనికి విద్య రాదనిన్ని వీనిది మంచికులము కాదనిన్ని అనాదరణ చేయరు. తమ్ము సేవింపుచుండినంజాలునని యెంచుదురు.యేభృత్యుడు రాజుయొక్క కోపప్రసాదములచిహ్న లెరింగి చరియించునో వాడు రాజుదయచేతను ప్రసిద్ధి నొందును.

అనిన కరకటకుండు - ఓయీ రాజుదగ్గిర పోయి నీవు యేమి మాట్లాడుచున్నా వని యడిగెను. అందుకు దమనకుడు చెప్పుచున్నాడు. మంచివర్షము కురిసితే విత్తనమువల్ల మరియొకనిత్తనము యెట్లా పుట్టుచున్నచో - అటువలెనే బాగాఉత్తరము చెప్పినట్టయితే దానివల్ల మరియొకఉ త్తరము పుట్టుచున్నది. నీతిమార్గమునందు ప్రవర్తించిన బుద్ధిమంతులు ఉపాయమును జూపించుటవల్ల వచ్చే కార్యసిద్ధినిన్ని అపాయమును చూపించుటవల్ల వచ్చే పనిచెరుపునున్ను యెదట అగుపడుచున్నట్టు తెలియజేయుచున్నారు. నేను సమయమును విచారించకుండా చెప్పను. బృహస్పతి అయినప్పటికిన్ని సమయము విచారించక మాట్లాడెనా అవమానము పొందును. ఏగుణముచేత జీవనము కలుగునో ఏగుణమువల్ల లోకములో సత్పురుషులచేత స్తోత్రము చేయబడునో అదే మంచిగుణము. ఆగుణముచేతనే నరుడు గుణవంతు డనిపించుకొనును. కాబట్టి ఆగుణమునుకాపాడుకొని వృద్ధిపొందించుకొనవలసినది.

అనిన కరటకుడు నీకు కార్యంబు సిద్ధించును పొమ్మని దమనకునితో చెప్పెను. అంతట దమనకుడు పింగళకువికిదగ్గిరికి పోయి వినయభయభక్తులతో దండము పెట్టిన పింగళకుడు అతని మిక్కిలిఆదరణతో కూర్చుండ నియమించి బహుదినములకు నిన్ను చూచితినని పలికిన దమనకుం డిట్లనియె.

దేవరవారికి నావల్ల యేమి ప్రయోజనమున్నది. అయినా సమయము వచ్చినప్పుడు లెస్సగా ఆలోచన చెప్పవలయునని వచ్చినాను. మంత్రి యైనవాడు తనరాజుకు సమయము వచ్చినప్పుడు కార్యాకార్యంబులు తెలియజేయుటకై తన్ను పిలువకున్నా రాజుదగ్గరికి రావలయును. నేనే కాదు యెటువంటిమానవ్యుడైనా రాజులకు ఒకానొకవేళ బనికివచ్చును. అచేతనములైనగడ్డిపుల్లలు మొదలైనవికూడా చెవిదురద పోగొట్టుకోవడము పల్లు కుట్టుకోవడము మొ