పుట:పంచతంత్రము (నేలటూరు రాఘవయ్య).pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దలైనవాటికి పనికివచ్చుచుండగానోరు చేతులు మొదలైన అవయవములుగల మానవుండు పనికిరాకపోవునా ధైర్యవంతునికి ఒకవేళ ఆపద వచ్చినా అతడు మునపటిధైర్యమును వదలడు. దివిటీలు తలకిందుగా బట్టుకొన్నా దానిజ్వాలలు ఊర్ధ్యముఖములే అవును గాని యెన్నటికిన్ని అధోముఖములు గావు. మరియు విశేషజ్ఞుడైన రాజునకు సమస్తమున్ను ముందుగానే అగుపడును. పైరు పెట్టేవాడు సకలమైనవిత్తనములున్ను యుక్తమయిన సమయములో మొలక మొలవగానే జూచి ఈపైరు యింతమాత్రము పండునని తెలుసుకొన్నట్లు బుద్ధిమంతుడైనవాడు మనుష్యులఆకారము చూచి వారిమనోవృత్తిని నిశ్చయించును. రాజైనవాడు తనభృత్యులయోగ్యాయోగ్యతలు తెలియక వారికి ఉద్యోగములు యిస్తే తలను ధరించేమాణిక్యమును కాళ్లయందున్ను కాళ్లను ధరించేఅందె తలయందున్ను ధరించినట్లు అపహాస్యానకు ఆస్పదమగును. కుందనముతో పొదుగుటకు తగిన శ్రేష్ఠరత్నమును ఇత్తడితో పొదిగితే రత్నమునకు యేమి కొదువ వచ్చును. తనబంటుకు తగినపని పెట్టకుంటె ఆతప్పు రాజుది గాని బంటుది కాదు. ఇతడు బుద్ధిమంతుడు ఇతడు తనయందు ప్రీతిగలవాడు ఇతడు మందుడు అని రాజు తెలుసుకొని వారివారిని తగినపనులయం దుంచితే వారు అతని విడువక బహుకాలము కొలుచుచుందురు. గుఱ్ఱమునకున్ను ఆయుధమునకున్ను శాస్త్రమునకున్ను వీణెకున్ను వాక్కుకున్ను స్త్రీకిన్ని నేర్పరియైనపురుషునికిన్ని ఒకానొకపురుషుని పొందుటచేత యోగ్యత గలుగు. ఒకానొకపురుషుని పొందుటచేత అయోగ్యత గలుగును. ఓమహానుభావా నన్ను జంబుకమాత్రముగా నీమనస్సులో నెంచగూడదు. విష్ణువు వరాహరూపముచేతనున్ను శివుడు మృగరూపముచేతనున్ను కుమారస్వామి ఛాగరూపముచేతనున్ను ఇంద్రాగ్నులు పక్షిరూపముచేతనున్ను దేవత చేత పూజింపబడినవారు కారా. సేవకుడు భక్తిగలవాడయి అసమర్థుడైతె ప్రయోజన మేమి. సమర్థుడయి భక్తిలేనివాడైతే ప్రయోజన మేమి. సమర్ధుఁడనై భక్తిగలిగిననన్ను మీరు చిన్నచూపు చూడవద్దు. రాజు అవమానించుటవలన పరిజనులు బుద్ధిహీను లవుదురు. వారు బుద్ధిహీనులు కాగానే పెద్దలు రాజును విడుతురు. పెద్దలు రాజును విడువగానే న్యాయము నశించి అన్యాయము వృద్ధిబొందును. న్యాయము నశించగానే సకలలోకములున్ను చెడిపోవును. కాబట్టి రాజు వివేకముగలవాడై యుండెను.

అని దమనకుడు పలికిన పింగళకుం డిట్లనియె. ఓయీ నీవు మాప్రధానమంత్రిపుత్రుండవు గనక చెప్పవలసిన మాటలు చెప్పవచ్చును దానివల్ల తప్పేమి అని ష