పుట:నీతి రత్నాకరము.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మూడవ వీచిక

37

శ్లో. 'యాదృశీ భావనా యత్ర సిద్ధి ర్భవతి తాదృశీ'

అన్న పెద్దలమాట తప్పదుకదా. ఆ దేవాలయమున మధ్యాహ్న సాయంకాలముల నర్చకు లుందురు. ఇతర కాలములయందు మహర్షులు పావురములుగా వచ్చి యా దేవు నారాధింతురని కొందఱు వాకోనుదురు. ఎతవఱ కది నిశ్చయమో కానీ పావురములు మాత్రము కలరవములు చేయుచు గోపురము మీదను, విమానములపై నను దిరుగుచుండుట నిశ్చయము. ఆపావురము లే మహర్షులు, ఆకలరవము లే సామగానములు, అగునన్నఁ గాదనువా రెవ్వరు ?

ఆదేవాలయమునకుఁ బాతాళుఁడు కుంతలుఁడు పోవు చుండువారు. ఆయర్చకులు పాతాళునకు మిత్రులు, ఎపుడైన నతఁడు హోమము చేయుచు నాలుగుడబ్బులు పూజారుల కిప్పించుచుండుటం బట్టి వారు వానికి మిత్రులైరి. వారితో నొకనాఁడు పాతాళుఁడు తన మనోగతము నిట్లెఱింగించెను. మీరు నాకుఁ జిర కాలమిత్రులు. ఎన్నఁడుగానీ మీ వలన నొక కార్యము కావలసియున్న దని చెప్పినది లేదు. ఇపు డొకమహా కార్యము నాకుఁ గల్గినది. నావలన మీకు ముందెంతో మేలు కలుగఁగలదు. అది యిపుడే తెల్పుట న్యాయము కాదు. విషయమును వినుండు. దాని వెలిపుచ్చమని ప్రమాణము చేయవలయును. అని వారట్లే ప్రమాణముచేయఁగా నిట్లు తెల్పెను. మాపట్టణమున శ్రీనివాసదాసు గలఁడు కదా. అతని భార్య నాతోబుట్టువు. చిన్న తనము నుండి తనకూఁతును రాధికను నాకిచ్చి పెండ్లి చేయుదునని వాగ్దానము చేయుచు నిపు డీయననుచున్నాఁడు. ఈకన్యకను నమ్మి యెందఱో కన్య