పుట:నీతి రత్నాకరము.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

38

నీతిరత్నాకరము

కల నిత్తుమన్న వలదంటిని. నన్ను నమ్మించి యిపు డిట్లు చేయుట న్యాయమా! ధనవంతుఁడు కాన నేది యెట్లు చేసినను జెల్లును. ధసహీనుఁడనగుట నాపక్షమున నెవ్వరు న్యాయముకూడఁ బలుకరు. కాలమహిమ మిట్లున్నది. కావున న్యాయమును నిలుపఁ బూని నే నొకయుపాయము చేసితిని. ఆకన్యకను నడికి రేయి నిటఁ గొనివత్తును. దేహస్మృతి లేకయుండఁ జేసి తెచ్చెదను. మీరు రాత్రు లిందుంట వాడుక లేదు కదా. తలుపులు తెఱచి యుంచుఁడు. ఆ రేయి వివాహము జరపుకొని యెందో పోవుదుము. మఱుదినము మీరందఱతో నెవరో తలుపులు తెఱచి రని చెప్పుఁడు. మీకేమియు బాధయుండదు. నాపనియు నగును. ఈయుపకారమునకై మీకెంతో ధనమిత్తును. ఆజన్మము. మీకుఁ గృతజ్ఞుడనై యుందును. ఈవార్తను బదిలముగ మది నిలుపుఁడు. ఆని యుక్త యుక్తముగాఁ దెలిపితిని గదా యని సంతసించుచుఁ దెలిపెను. వా రామాటల నమ్మి యట్లే కానిమ్మని యంగీకారమును దెలిపిరి.

ఒక్కనాడు కుంతలుని బిలిచి పాతాళుఁ డిట్లు బోధించెను. వ్యాధులు తొమ్మండ్రుగురు నామాట జవదాటక చేయువారు గలరు. ఈకృష్ణసప్తమీశుక్రవారము సాయం కాలము వారు నీయింటికి వత్తురు. వారి కన్నము పెట్టి తాంబూల మిమ్ము. జామురాత్రి, కాఁగా నిరువురు మనుష్యులు సురాభాండములఁ దీసికోని మీయింటి వెనుకటిభాగమునుండి పిలుతురు. ఆందేయుండి తలుపుతీయుము. తొమ్మండ్రుగురు వ్యాధులు తనివితీఱఁ ద్రావుదురు. వారిం దోడ్కొని శ్రీనివాసు దాసు నింటి వెనుకటి భాగముకడకు రమ్ము, అందొక్క వట.