పుట:నీతి రత్నాకరము.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

28

నీతిరత్నాకరము

బంపుచుండిరి. ఆలకించియు బదులాడక సంతోషము సంతోష మని బదులుగనాడుచు సుంతకాలము ద్రోయుచుండెను.

శ్రీకృష్ణదాసు రాధిక విఖ్యాతిని బెక్కండ్రు, పేర్కొన వినుచుండువాఁడు. సంగీతపరీక్ష సాగి బహుమానము పొందిన యా ప్రఖ్యాతిని గూడ నాలకించెను. అంతట నారాధికను బెండ్లియాడఁ దలంచుకొనియెను. కాని తల్లిదండ్రులయభి ప్రాయ మెట్టిదో కనుఁగొనినపిదప నీవిషయము సిద్ధాంతము చేయవచ్చునని యూరకుండెను. అచ్చట రాధికయు శ్రీకృష్ణ దాసు గుణగణమును "బెద్దలు గణుతింప విని యానం దించుచుఁ దల్లిదండ్రులయాశయము నేఱుంగ వేచియుండెను. మనసున నొక్కని గోరినపిదప నింకొక్క నిగోరుట, స్త్రీలకు ధర్మముగా దనియుఁ బాతి వ్రత్యమున కది భంగకరమనియు నామె తలం చుచు నుదాహరణము సావీ త్రీ చరిత్ర మును జింతించుచు నా పతివ్రతాశిరోమణిని బొగడుచు నెంతటి మహత్త్వ మామె కీనియమమునఁ గల్గెనో యని ' లెక్కించుచు నపరిమితానంద మందుచు నుండెను.

వివాహనియమము

ఈవిషయము నిక్కడ వ్రాయఁ దలంచుకొను టనుచితము కాదు. కన్యకి ఫుట్టినది మొదలు తల్లిదండ్రులు తగినవరు నెమకుచుందురు యుక్తవయస్సు, కులము, గుణము, శీలము, శ్రీ, విద్య, తల్లిదండ్రు లయల వాటులు కన్యాజనకులు పరీక్షించు చుందురు. కన్య కామూలమునఁ దమవంశమున కేలాటి కళంకము రాకయుండవలయునని వారికోరికలలోఁ దొలుతటి దన వలయు. ఈవిషయమునఁ దల్లికంటెఁ దండ్రియే యెక్కుడు