పుట:నీతి రత్నాకరము.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రెండవ వీచిక

29

 భారము మోయఁదగియుండును. తల్లి యూహలు కొన్ని విషయములయందుఁ గుఱుచలగుచుండును. దండ్రి యూహలు సాగుచుండును. కావునఁ దండ్రి, యత్యంతశ్రమముల ననుభవించియైనఁ గొమరితకు ననురూపుఁ డగువరు నరయును. వరుని తల్లిదండ్రులు నిట్లె యనురూపకన్యాన్వేషణతత్పరులయియే యుందురు. తల్లిదండ్రులు కాక బంధువులందఱుఁ దగిసస్థలమును నెమకుదురు గాని యది యంత పరిగణింపఁదగినది కాదు. కన్యక పదివత్సరములకంటె మించని యీడుక లదిగనున్న తఱినో యంతకు రెండేండ్లముందుగనో వివాహము చేయు నలవాటు ప్రాచీనా చారమునఁ బ్రసిద్ధిం గాంచినది. అంత చిన్న తనమునఁ బెండ్లి చేయఁ దగునా యని కొంద ఱందురు. అది మిగులఁ బొరపాటు.

మానవుల కెల్లరకుఁ దఱచుగా మనస్సు తెల్ల వారు జామున (అనఁగా నుషఃకాలమునందు) నిర్మలముగా నుండును. ఆకాలమునందే 'వేదము చెప్పుదురు. ఏలనఁగా నితర కార్య ములయందు వ్యాపృతము కాకయుండును గాన దానికి గ్రహణశక్తి యెక్కువగా నుండుననియే యనవలయు. మఱి కొలఁదిగడియలకది సర్వతోముఖముగ వ్యాపించును అట్లే కన్యావరులమైత్రి , చిన్న తనమునందే కలిగినచో నది దృఢ ముగ నుండఁజాలి చిరకాలము నిలుచును శాస్తోక్తవయః పరిమితియందు నా యిరువురచి త్తములు చంచలతం గాంచియుండవు, ఆతరుణమునఁ గన్యక వరుఁడీతఁడు యావజ్జీవము నా కాధారభూతుడు. ఈతనివదలిన నాకు గత్యంతరము లేదు. ఈతనియాజ్ఞ భగవదాజ్ఞ వంటిది. మీఱరానిది