పుట:నీతి రత్నాకరము.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రెండవ వీచిక

27

సాగఁగా రామదాసుగారే విధివిహితముగా నక్షరాభ్యాస కర్మము నడపిరి. భోజనము యథావిధి సాగెను భూరిదక్షిణ లొసఁగఁబడియెను. పండితులు పరిపూర్ణ మనోరథులై తమ తమయిరవుల కరిగిరి. రామదాసుగారా శ్రీవత్సాంకదాసుతో జరిగినదంతయుం 'దెలిపి యిందులకై వచ్చితినని చెప్పి యాతని సాధ్వీమణి గొప్పబుద్దిని బొగడి యామె గొప్పదనమే యింతకు మూల కారణము సుమీ యని హెచ్చరించి తనయిచ్చం బోయెను. అనుకూలభార్యావంతుఁ డెంత యదృష్టవంతుడో కదా యని తనమదిఁ జింతించుచు నా దాసు నెమ్మదిగ నుండెను.

శ్రీకృష్ణదాసు క్రమక్ర మముగఁ జదువను వ్రాయను నేర్చుకొనెను. మఱికొంతకాలమునకుఁ జక్కఁగాఁ గావ్యనాటు కాదులం బఠించి చక్కనిసాహిత్య మలవఱచుకొనెను. మహారాష్ట్ర భాష యందు నా బాలకునితోఁ దుల్యుఁడు లేఁడన్న విఖ్యాతి వ్యాపించెను. పదునాఱవయేడు వచ్చునప్పటికిఁ గులోక్త కర్మ కలాపము చక్కఁగా జరపఁబడఁగా నాతఁడు విద్వాంసుఁడు కూడ నయ్యెను. వివాహ ప్రయత్నము చేయవలసినదని పెద్ద లపుడపుడు త్వర పెట్టసాగిరి. కులోద్దారకుఁడగు కొడుకొక్కఁడే చాలునన్న సామెత యాదంపతులకుఁ దృప్తిని గల్పించుచుండెను. భార్యయు సమయమును గనిపెట్టి ప్రస్తావవశమునఁ బెండ్లిమాట యాలోచింప సమయ మిది కాదా యని యడుగుచుండెను. నేను నా ప్రయత్నము చేయ నెంచితినని యాతఁడు సమాధాన మిచ్చుచుండెను. ఆవిషయమును విని పెక్కండ్రు, తమకొమరితల నిత్తుమని సువార్తలఁ